Rahul Gandhi | బెదిరింపులతో జెన్ జీ నోరు నొక్కేయలేరు.. మోదీ, షాపై రాహుల్ విమర్శలు
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah)ను లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెదిరింపులతో జెన్ జీ నోరు నొక్కేయలేరని పేర్కొన్నారు.
Rahul Gandhi | త్రినేత్ర.న్యూస్ : జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై (Student Violence) పోలీసులు లాఠీఛార్జ్, పెల్లెట్ గన్స్ ప్రయోగం అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah)ను లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇది కూడా చదవండి : లోక్‌సభలో రాహుల్ Vs కేంద్రం.. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై సభలో రగడ
మోదీ, షా.. మీరు బెదిరింపులతో జెన్ జీ (Gen Z) గొంతును నొక్కేయలేరు అంటూ హెచ్చరించారు. నిరసన తెలిపిన విద్యార్థులపై మొదట దాడులు చేసి ఎముకలు విరగ్గొట్టారని, ఇప్పుడు వారిపై ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను సైతం తొలగిస్తూ వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను దేశ భవిష్యత్తుగా అభివర్ణించిన రాహుల్.. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్రానికి సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
PM Modi and Amit Shah - you cannot threaten Gen Z into silence.
First you broke their bones. Now you are filing FIRs and taking down their accounts.
You are India’s past. Be careful about how you treat India’s future.
— Rahul Gandhi (@RahulGandhi) July 31, 2026
రాహుల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
ఇదిలా ఉండగా.. లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి రాహుల్ చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్‌ను గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. రాహుల్ సభలో అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించినట్లు అందులో పేర్కొన్నారు. అమిత్ షాపై తీవ్రమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పారు. ప్రతిపక్ష నేతపై చర్యలు తీసుకోవాలని కోరారు. అమిత్ షాకు రాహుల్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి : తప్పు చేయకపోతే భయమెందుకు..? అమిత్ షాను టార్గెట్ చేసిన రాహుల్
Also Read..
ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు
స్టేజ్‌పైనే కుప్పకూలిన హ్యూమనాయిడ్ రోబో.. సోషల్ మీడియాలో మీమ్స్..
ఫోన్ కొనేముందు తప్పక తెలుసుకోండి.. ఆన్ డివైస్ ఏఐ అంటే ఏమిటి ?
తాజావార్తలు
- ●TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మణ్ బాట భావితరాలకు నిరంతర స్ఫూర్తి
- ●Sreeleela | ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల రికార్డ్ - దళపతి విజయ్, రష్మిక మందన్న తర్వాతి ప్లేస్‌లో...
- ●Weekend Drunk and Drive Cases | నేరమని చెప్పినా మారడం లేదు.. ఈ వీకెండ్లో 97 కేసులు నమోదు చేశాం
- ●KTR | 8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ
- ●Velishala | వెలిశాలలో 13 రోజుల్లో ఆరుగురు మృతి.. సర్పంచ్ ఏమన్నారంటే..?
- ●Raghav Chadha | ఇక నుంచి 30 రోజుల ప్లాన్లు.. ఏడాదికి 12 రీచార్జ్లే: ఎంపీ రాఘవ్ చద్దా

TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మణ్ బాట భావితరాలకు నిరంతర స్ఫూర్తి

Sreeleela | ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల రికార్డ్ - దళపతి విజయ్, రష్మిక మందన్న తర్వాతి ప్లేస్‌లో...

Weekend Drunk and Drive Cases | నేరమని చెప్పినా మారడం లేదు.. ఈ వీకెండ్లో 97 కేసులు నమోదు చేశాం

KTR | 8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ






