త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Garividi Lakshmi OTT | ఓటీటీలోకి ఉత్తరాంధ్ర జానపద గాయని బయోపిక్‌.. రేపటి నుంచే స్ట్రీమింగ్‌!

Garividi Lakshmi OTT | సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు కొన్ని చిత్రాలు స్లోగా మొదలై.. ఆ తర్వాత అనూహ్యంగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటాయి. కంటెంట్ బాగుంటే మౌత్ టాక్‌తోనే మంచి వసూళ్లు సాధిస్తాయని మరోసారి నిరూపించింది ‘గరివిడి లక్ష్మి’ సినిమా.

P

Entertainment | Published On Nov 25, 2026, 4.24 pm IST

Garividi Lakshmi OTT | ఓటీటీలోకి ఉత్తరాంధ్ర జానపద గాయని బయోపిక్‌.. రేపటి నుంచే స్ట్రీమింగ్‌!
Advertisement

Garividi Lakshmi OTT | సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు కొన్ని చిత్రాలు స్లోగా మొదలై.. ఆ తర్వాత అనూహ్యంగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటాయి. కంటెంట్ బాగుంటే మౌత్ టాక్‌తోనే మంచి వసూళ్లు సాధిస్తాయని మరోసారి నిరూపించింది ‘గరివిడి లక్ష్మి’ సినిమా. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్‌.. బాక్సాఫీస్‌ వద్ద మొదట ఆశించిన స్థాయిలో ఆరంభం కాకపోయినా.. ఉత్తరాంధ్రలో మాత్రం అదరగొట్టింది. వరుసగా హౌస్‌ఫుల్‌ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా వసూళ్ల విషయంలోనూ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మిగతా ప్రాంతాలన్నింటిలో వచ్చిన కలెక్షన్ల కంటే ఒక్క ఉత్తరాంధ్రలోనే ఎక్కువ వసూళ్లు నమోదైనట్లు సమాచారం.

స్థానిక ప్రేక్షకులకు పరిచయమున్న ఓ కళాకారిణి జీవితాన్ని తెరపై ఆవిష్కరించడంతో ఈ ప్రాంతంలో సినిమాకు మంచి స్పందన లభించింది. కథలోని భావోద్వేగాలు, జానపద నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్‌ అయిన వారంతా ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి ప్రేక్షకులకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ‘గరివిడి లక్ష్మి’ సినిమా నవంబర్‌ 26 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని తాజా సమాచారం. అంటే థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇంట్లోనే ఈ బయోపిక్‌ను చూసే అవకాశం దక్కనుంది. ఐదు భాషల్లో అందుబాటులోకి వస్తుండటంతో ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు కూడా ఈ కథ చేరువ కానుంది.

ఈ చిత్రంలో గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించి మెప్పించింది. ఆమె నటనతో పాటు పాత్ర కోసం చూపించిన అభినయం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. నరేశ్‌, రాశి, రాగ్‌ మయూర్‌, శ్రీనివాస్‌ అవసరాల, అంకిత్‌ కొయ్య, ఎల్బీ శ్రీరామ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించారు. మొత్తానికి థియేటర్లలో ఉత్తరాంధ్ర ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ‘గరివిడి లక్ష్మి’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. మరి డిజిటల్‌ వేదికపై ఈ బయోపిక్‌కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Advertisement
Advertisement