త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | జేబులో పేలిన ప‌వ‌ర్ బ్యాంక్.. కుడి క‌న్నుకు తీవ్ర గాయం

Hyderabad | ఓ యువ‌కుడి జేబులో ఉన్న ప‌వ‌ర్ బ్యాంక్ పేలిపోయింది. దీంతో అత‌డి కుడి క‌న్నుకు తీవ్ర గాయ‌మైంది.

S

Hyderabad | Published On Nov 25, 2026, 4.18 pm IST

Hyderabad | జేబులో పేలిన ప‌వ‌ర్ బ్యాంక్.. కుడి క‌న్నుకు తీవ్ర గాయం
Advertisement

Hyderabad | త్రినేత్ర న్యూస్ : ఓ యువ‌కుడి జేబులో ఉన్న ప‌వ‌ర్ బ్యాంక్ పేలిపోయింది. దీంతో అత‌డి కుడి క‌న్నుకు తీవ్ర గాయ‌మైంది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని ర‌హ‌మ‌త్ న‌గ‌ర్‌లో బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు చోటు చేసుకుంది.

ప‌వ‌ర్ బ్యాంక్ పేలిన ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. అయితే బాధిత వ్య‌క్తికి 30 శాతం మేర కాలిన గాయాల‌య్యాయ‌ని మ‌ధురా న‌గ‌ర్ పోలీసులు వెల్ల‌డించారు. అనంత‌రం బాధితుడు శ్ర‌వ‌ణ్‌ను యూసుఫ్‌గూడ‌లోని మ్యాగ్నైడ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత‌ని కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Advertisement
Advertisement