Qualcomm | స్టేజ్‌పైనే కుప్పకూలిన హ్యూమనాయిడ్ రోబో.. సోషల్ మీడియాలో మీమ్స్..
Qualcomm | తైపీలో జరిగిన కంప్యూటెక్స్ 2026 కార్యక్రమంలో క్వాల్‌కమ్‌కు చెందిన డ్రాగన్‌వింగ్ ఐక్యూ10 ఏఐ ప్లాట్‌ఫామ్‌తో పనిచేసే హ్యూమనాయిడ్ రోబో ప్రత్యక్ష ప్రదర్శనలో ఒక్కసారిగా స్టేజ్‌పైనే కుప్పకూలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మీమ్స్, వ్యంగ్య పోస్టులు, సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
Technology | Published On Jul 31, 2026, 10.49 am IST
Qualcomm | తైపీలో జరిగిన కంప్యూటెక్స్ 2026 కార్యక్రమంలో క్వాల్‌కమ్‌కు చెందిన డ్రాగన్‌వింగ్ ఐక్యూ10 ఏఐ ప్లాట్‌ఫామ్‌తో పనిచేసే హ్యూమనాయిడ్ రోబో ప్రత్యక్ష ప్రదర్శనలో ఒక్కసారిగా స్టేజ్‌పైనే కుప్పకూలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మీమ్స్, వ్యంగ్య పోస్టులు, సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన క్వాల్‌కమ్ నిర్వహించిన డ్రాగన్‌వింగ్ ఐక్యూ10 రోబోటిక్స్ రిఫరెన్స్ డిజైన్ ప్రదర్శన సందర్భంగా చోటుచేసుకుంది. ఈ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను హ్యూమనాయిడ్, ఇండస్ట్రియల్ రోబోలకు ఉపయోగించేలా రూపొందించారు. వైరల్ వీడియోలో రోబో ఒక గ్యాడ్జెట్‌ను చేతిలో పట్టుకుని స్టేజ్‌పై నడుస్తూ కనిపించింది. అయితే కొద్ది క్షణాలకే దాని పనితీరు దెబ్బతిన్నట్లుగా కనిపించి ఒక్కసారిగా కుప్పకూలింది.
చర్చకు దారి తీసిన సిబ్బంది తీరు..
రోబో కూలిపోవడంతో అక్కడి సిబ్బంది వెంటనే స్టేజ్‌పైకి చేరుకుని దానిపై నల్లని వస్త్రం కప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇదే సమయంలో కార్యక్రమం మాత్రం యథావిధిగా కొనసాగింది. సిబ్బంది స్పందించిన తీరు సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీసింది. రోబోకు అంత్యక్రియలు నిర్వహించారు అంటూ పలువురు నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తూ మీమ్స్ రూపొందించారు. డ్రాగన్‌వింగ్ ఐక్యూ10 ప్లాట్‌ఫామ్ హ్యూమనాయిడ్, ఇండస్ట్రియల్ రోబోలకు అధునాతన ఏఐ సామర్థ్యాలను అందించేందుకు పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా 700 టాప్స్ (ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్) స్థాయి ఏఐ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
— SKatalystAI (@SKatalystAI)
July 31, 2026
కమ్యూనికేషన్ లోపం వల్లే..
ఈ ఘటనపై క్వాల్‌కామ్ తర్వాత వివరణ ఇచ్చింది. స్వల్పకాలిక కమ్యూనికేషన్ లోపం కారణంగా ప్రోటోటైప్ రోబోలో ఫాల్ట్ ఏర్పడిందని తెలిపింది. దీంతో రోబోలో ముందుగానే అమర్చిన సేఫ్-కొలాప్స్ విధానం ఆటోమేటిగ్గా పనిచేసి, సమీపంలో ఉన్న వ్యక్తులు, పరికరాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా నియంత్రిత పద్ధతిలో మోకాళ్లపైకి వాలి షట్‌డౌన్ అయిందని వివరించింది. రోబోలో అమర్చిన భద్రతా వ్యవస్థలు అనుకున్న విధంగానే పనిచేశాయని క్వాల్‌కమ్ పేర్కొంది. ఈ ఘటన ద్వారా లభించిన వాస్తవ డేటా భవిష్యత్తులో మరింత మెరుగైన రోబోటిక్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ప్రత్యక్ష ప్రదర్శనల్లో ఇలాంటి ప్రమాదాల అవకాశాలు సహజమేనని క్వాల్‌కమ్ పేర్కొంది. రోబో మోకాళ్లపైకి వాలడం కూడా ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించిన భద్రతా ప్రతిస్పందనలో భాగమేనని స్పష్టం చేసింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత: మీటింగ్‌కు ముందే సీజేపీ నేతల అరెస్ట్.. సీఎం హిమంతపై తీవ్ర ఆరోపణలు
- ●Ramayana | డివైన్ లుక్‌లో సాయిపల్లవి - రామాయణ పోస్టర్ రిలీజ్ - విమర్శలకు చెక్ పెట్టిన నాచురల్ బ్యూటీ
- ●Minister Seethakka | విద్యకు వయసుతో సంబంధం లేదు : మంత్రి సీతక్క
- ●Komati Reddy Rajagopal Reddy | నాకు మంత్రి పదవి ఇవ్వడం రేవంత్ చేతిలో లేదు
- ●Medaram | మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?
- ●Jeevan Reddy | తెలంగాణకు శనిలా దాపురించారు

Cockroach Janta Party | అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత: మీటింగ్‌కు ముందే సీజేపీ నేతల అరెస్ట్.. సీఎం హిమంతపై తీవ్ర ఆరోపణలు

Ramayana | డివైన్ లుక్‌లో సాయిపల్లవి - రామాయణ పోస్టర్ రిలీజ్ - విమర్శలకు చెక్ పెట్టిన నాచురల్ బ్యూటీ

Minister Seethakka | విద్యకు వయసుతో సంబంధం లేదు : మంత్రి సీతక్క

Komati Reddy Rajagopal Reddy | నాకు మంత్రి పదవి ఇవ్వడం రేవంత్ చేతిలో లేదు




