Lung Cancer | విషగాలి పంజా.. పొగతాగని వారిలోనూ విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్..!
Lung Cancer | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (toxic air)ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 2020 జనవరి నుంచి ఈ ఏడాది జులై వరకు ఎయిమ్స్ సహా ఢిల్లీలోని ఆరు ప్రధాన ఆసుపత్రుల్లో కొత్తగా మొత్తం 6,581 ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.
Lung Cancer | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో విషపూరితమైన గాలి పంజా (toxic air) విసురుతోంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. కేవలం పొగతాగే వారికే కాకుండా అసలు సిగరెటే ముట్టని వారు, మహిళలు, యువతలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.
తాజా గణాంకాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో 2020 జనవరి నుంచి ఈ ఏడాది జులై వరకు ఎయిమ్స్ సహా ఢిల్లీలోని ఆరు ప్రధాన ఆసుపత్రుల్లో కొత్తగా మొత్తం 6,581 ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఆరున్నరేళ్ల కాలంలో సగటున నెలకు 83 కొత్త కేసులు నమోదవగా.. ప్రతి మూడు రోజులకు ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ (PTI) సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సేకరించిన ఈ గణాంకాలు రాజధానిలో పెరుగుతున్న వ్యాధి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ధూమపానం ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. అయితే, కాలుష్య వాతావరణంలో నివసించడం వల్ల యువత, మహిళలు, ధూమపానం చేయని వారిలో ఈ వ్యాధి పెరుగుతుండటం ఆందోళనకరం. గ్లోబోకాన్ (Globocan) 2024 అంచనాల ప్రకారం, భారతదేశంలో నమోదైన 1,12,659 కొత్త కేసులతో ఊపిరితిత్తుల క్యాన్సర్ మూడో స్థానంలో ఉండగా, 98,687 మరణాలతో అత్యధిక ప్రాణాలు తీస్తున్న క్యాన్సర్‌గా మొదటి స్థానంలో ఉంది.
వైద్యుల ఆందోళన
పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరగడానికి గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు (PM 2.5) ప్రధాన కారణమని ఆరోగ్య వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆర్టీఐ గణాంకాలు ఒక హెచ్చరిక మాత్రమేనని.. వాస్తవ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని ఇతర ఆసుపత్రులు, రాజధాని సమీప నగరాల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్యను కలిపితే వాస్తవ పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని గురుగ్రామ్‌లోని ఫార్టిస్ ఆసుపత్రి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నితీశ్ రోహత్గీ పేర్కొన్నారు.
పెరుగుతున్న అడెనోకార్సినోమా రకం క్యాన్సర్
పొగతాగని వారిలో ఎక్కువగా కనిపించే 'అడెనోకార్సినోమా' (Adenocarcinoma) అనే రకం క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువగా బయటపడుతోందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారని.. ఎక్కడో ఏదో తీవ్రమైన లోపం జరుగుతోందని అపోలో ఎథీనా ఉమెన్స్ క్యాన్సర్ సెంటర్ ప్రిన్సిపల్ లీడ్ డాక్టర్ గీతా కదయప్రత్ అన్నారు. బహిరంగ వాయు కాలుష్యం, పరోక్ష ధూమపానం (Passive smoking), వంట చెరుకు పొగ, వృత్తిపరమైన రసాయనాలకు గురికావడం కూడా ఈ క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని వివరించారు.
ఆలస్యంగా గుర్తింపు - పెరుగుతున్న ముప్పు
ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు పెద్దగా కనిపించవు. దీర్ఘకాలిక దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం, దగ్గులో రక్తం పడటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. సాధారణంగా ఈ లక్షణాలను టీబీ (TB) లేదా కాలుష్యం వల్ల వచ్చే సాధారణ దగ్గుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా వ్యాధి స్టేజ్-3, స్టేజ్-4కు చేరుకున్న తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారని, అప్పటికే చికిత్స కష్టతరమవుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిపుణులు ఏం చెబుతున్నారు..
కేవలం పొగాకు నియంత్రణకే పరిమితం కాకుండా, వాయు కాలుష్య నివారణపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారతీయ రోగుల్లో EGFR, ALK వంటి జన్యు ఉత్పరివర్తనాలు (Genetic mutations) ఎక్కువగా ఉంటున్నాయని, వీటికి టార్గెటెడ్ థెరపీలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయితే, మాలిక్యులర్ పరీక్షలు, మందుల ఖర్చు సామాన్యులకు భారంగా మారుతోంది. అందువల్ల పొగతాగని వారికి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలని, ఖరీదైన మాలిక్యులర్ పరీక్షలు, మందుల ధరలను తగ్గించాలని వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Also Read..
ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు దుర్మరణం
రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికత అందిస్తాం
పాఠశాల విద్యలో ఇంటర్‌ను కలుపుతారా?.. ఇంటర్ విద్యలో స్కూల్ విద్యను కలుపుతారా?: కవిత
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Class 3 Student | తరగతి గదిలో కుప్పకూలిన 9 ఏండ్ల బాలిక.. దవాఖానకు తరలించేలోగా..
నవంబర్ 25, 2026

Miss Universe 2026 | భారత్‌కు నిరాశ.. విశ్వసుందరి కిరీటాన్ని ఎగరేసుకుపోయిన ప్యూర్టో రికో భామ
నవంబర్ 25, 2026

Vivek Venkata Swamy | తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Tummala Nageshwar Rao | రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికత అందిస్తాం
- ●Kavitha | పాఠశాల విద్యలో ఇంటర్‌ను కలుపుతారా?.. ఇంటర్లో స్కూల్ విద్యను కలుపుతారా?: కవిత
- ●Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీల్లో ర్యాలీ..
- ●Garividi Lakshmi OTT | ఓటీటీలోకి ఉత్తరాంధ్ర జానపద గాయని బయోపిక్.. రేపటి నుంచే స్ట్రీమింగ్!
- ●Hyderabad | జేబులో పేలిన పవర్ బ్యాంక్.. కుడి కన్నుకు తీవ్ర గాయం
- ●Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు దుర్మరణం

Tummala Nageshwar Rao | రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికత అందిస్తాం

Kavitha | పాఠశాల విద్యలో ఇంటర్‌ను కలుపుతారా?.. ఇంటర్లో స్కూల్ విద్యను కలుపుతారా?: కవిత

Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీల్లో ర్యాలీ..

Garividi Lakshmi OTT | ఓటీటీలోకి ఉత్తరాంధ్ర జానపద గాయని బయోపిక్.. రేపటి నుంచే స్ట్రీమింగ్!



