త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట‌

Rahul Gandhi | రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో (Supreme Court) భారీ ఊర‌ట ద‌క్కింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌ల కేసులో అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్న‌త ధ‌ర్మాస‌నం రద్దు చేసింది.

D

National | Published On Nov 25, 2026, 3.34 pm IST

Rahul Gandhi | రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట‌
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ అగ్రనేత‌, ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో (Supreme Court) భారీ ఊర‌ట ద‌క్కింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లను ఆదేశిస్తూ అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్న‌త ధ‌ర్మాస‌నం రద్దు చేసింది.

రాహుల్ గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని ఆరోపిస్తూ కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ అలహాబాద్‌ హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌పాలంటూ సీబీఐ, ఈడీల‌ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల‌ను రాహుల్ సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. ఈ పిటిష‌న్‌ను పరిశీలించిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జ‌స్టిస్ వి.మోహ‌నాల‌తో కూడిన త్రిస‌భ ధ‌ర్మాస‌నం తదుపరి విచారణ ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టుకు సూచించింది. అంతేకాదు, ఎలాంటి నివేదికలను సమర్పించవద్దని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఆ పిటిషన్‌ను పునఃపరిశీలన కోసం హైకోర్టుకు తిరిగి పంపింది. ఈ పిటిషన్ విచారణకు అర్హమైనదా కాదా అనే అంశంతో సహా అన్ని విషయాలను మళ్లీ పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది.

Also Read..

హ‌త్య కేసు నిందితుడిపై కోర్టు ఆవ‌ర‌ణ‌లో దాడి.. క‌త్తుల‌తో న‌రికి

ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి..

న‌గ‌ర‌మంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిప‌డాలి

Advertisement
Advertisement