PM Modi | మళ్లీ ఎన్డీఏ గూటికి శిరోమణి అకాలీదళ్.. స్వాగతించిన ప్రధాని మోదీ
PM Modi | పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరింది. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అకాలీదళ్ కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పంజాబ్, ఆ రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ కూటమి తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
PM Modi | పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరింది. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అకాలీదళ్ కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పంజాబ్, ఆ రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ కూటమి తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. గురునానక్ దేవ్ జయంతి రోజున అకాలీదళ్ ఎన్డీఏలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బీజేపీ-అకాలీదళ్ బంధం సహజమైనదని, ప్రజా సంక్షేమ పాలన అందించడంతోపాటు పంజాబ్‌ను అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని తెలిపారు. బీజేపీ-అకాలీదళ్ బంధానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ బలమైన పునాదులు వేశారని మోదీ గుర్తుచేశారు. కాలపరీక్షకు నిలిచిన ఈ కూటమి మరోసారి పంజాబ్ ప్రజల ఆదరణ పొందుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
2027 ఎన్నికల్లో కలిసి పోటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం రెండు పార్టీలు 2027 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. అకాలీదళ్ తిరిగి ఎన్డీఏలో చేరుతోందని అమిత్ షా వెల్లడించారు. ఎన్డీఏ విస్తరణపై ప్రధాని మోదీతో చర్చించిన సమయంలో అకాలీదళ్ చేరిక అంశం ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. అనంతరం మోదీ.. సుఖ్‌బీర్ బాదల్‌కు ఫోన్ చేసి ఎన్డీఏ ఇప్పుడు సంపూర్ణమైందని చెప్పినట్లు వివరించారు. బీజేపీ, అకాలీదళ్ దశాబ్దాలుగా పంజాబ్ రాజకీయాల్లో మిత్రపక్షాలుగా కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2020లో అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వైదొలిగింది. అనంతరం ఆ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నప్పటికీ రెండు పార్టీల మధ్య దూరం కొనసాగింది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. తాజాగా 2027 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరోసారి చేతులు కలుపడం విశేషం.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MeitY | కంప్యూటర్ ఉత్పత్తులను ప్రభుత్వాలు కొనాలంటే కొత్త నిబంధనలు.. భారత్‌లో తయారవ్వాల్సిందే..
- ●Chiranjeevi | బాస్ రఫ్ఫాడించడం ఖాయం - ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో - మెగా వెర్స్ ప్రోమో రిలీజ్
- ●Toe Rings | పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!
- ●Harish Rao | నీళ్ల లెక్కలడిగితే.. అబద్ధాల వరద పారిస్తున్నడు
- ●Badi Lake Udaipur | కరువు నుంచి ఉదయ్‌పూర్‌ను కాపాడిన 350 ఏళ్ల చారిత్రక చెరువు.. ఈ 'బడీ లేక్' విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- ●Rashmika Mandanna | బయోపిక్ కోసం సంగీత పాఠాలు - నేషనల్ క్రష్ డెడికేషన్ అట్లుంటది మరి!

MeitY | కంప్యూటర్ ఉత్పత్తులను ప్రభుత్వాలు కొనాలంటే కొత్త నిబంధనలు.. భారత్‌లో తయారవ్వాల్సిందే..

Chiranjeevi | బాస్ రఫ్ఫాడించడం ఖాయం - ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో - మెగా వెర్స్ ప్రోమో రిలీజ్

Toe Rings | పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!

Harish Rao | నీళ్ల లెక్కలడిగితే.. అబద్ధాల వరద పారిస్తున్నడు






