Rahul Gandhi | తప్పు చేయకపోతే భయమెందుకు..? అమిత్ షాను టార్గెట్ చేసిన రాహుల్
Rahul Gandhi | కేంద్ర హోమంత్రి అమిత్ షా (Amit Shah)ను రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి టార్గెట్ చేశారు. విద్యార్థులపై జరిగిన హింసా కాండ ఘటనపై వివరణ ఇచ్చేందుకు పార్లమెంట్ (Parliament)కు రావడానికి అమిత్ షా ఎందుకు అంతగా భయపడుతున్నారు..? అంటూ ప్రశ్నించారు. తప్పు చేయకపోతే భయమెందుకు అని నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు పెట్టారు.
Rahul Gandhi | త్రినేత్ర.న్యూస్ : జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై (Student Violence) పోలీసులు లాఠీఛార్జ్, పెల్లెట్ గన్స్ ప్రయోగం అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర హోమంత్రి అమిత్ షా (Amit Shah)ను టార్గెట్ చేశారు. విద్యార్థి నిరసనకారులపై కాల్పులు జరపాలని అమిత్ షానే ఆదేశించారంటూ పార్లమెంట్ వేదికగా సంచలన ఆరోపణలు చేసిన రాహుల్.. తాజాగా మరోసారి ఆయన్ని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు పెట్టారు.
ఇది కూడా చదవండి : అమిత్ షా భయపడుతున్నారు
Why is Amit Shah so scared of coming to Parliament and explaining the brutal violence against students?
It reeks of guilt.
— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2026
విద్యార్థులపై జరిగిన హింసా కాండ ఘటనపై వివరణ ఇచ్చేందుకు పార్లమెంట్ (Parliament)కు రావడానికి అమిత్ షా ఎందుకు అంతగా భయపడుతున్నారు..? అంటూ ప్రశ్నించారు. షా ప్రవర్తన చూస్తుంటే తప్పు చేశారని స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ ఘటనలో విద్యార్థులకు న్యాయం జరగాలని రాహుల్ పేర్కొన్నారు. వారిపై జరిగిన 'క్రూరత్వాల'పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఒక కమిటీని నియమించి దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జులై 20న జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌కు సంబంధించిన వీడియోను ప్రతిపక్షనేత తన ట్వీట్‌కు జతచేశారు.
Students deserve justice.
An independent SC monitored high powered committee must be constituted to probe brutalities against our students. pic.twitter.com/pZATUeAjwC
— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2026
Also Read..
విద్యార్థులపైకి పెల్లెట్ గన్స్.. సీఆర్‌పీఎఫ్ డీజీ ఏమన్నారంటే..
అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడొచ్చు : సుప్రీంకోర్టు
ఎలాంటి భయాలూ లేకుండా పనిచేయండి.. నాదీ బాధ్యత.. పెల్లెట్ వివాదం వేళ CRPF చీఫ్ కీలక వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు






