Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీల్లో ర్యాలీ..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,500 పాయింట్లకు పైగా పెరగ్గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,800 మార్కును అధిగమించింది. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, ముడి చమురు ధరల తగ్గుదల, భారీ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,500 పాయింట్లకు పైగా పెరగ్గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,800 మార్కును అధిగమించింది. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, ముడి చమురు ధరల తగ్గుదల, భారీ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
సెన్సెక్స్ 1500 పాయింట్లు జంప్..
బీఎస్ఈ సెన్సెక్స్ 1,502.29 పాయింట్లు (1.82 శాతం) లాభపడి 83,938.28 వద్ద ముగిసింది. గత ముగింపు 82,435.99తో పోలిస్తే గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 469.60 పాయింట్లు (1.85 శాతం) పెరిగి 25,819.25 వద్ద స్థిరపడింది. గత ముగింపు 25,349.65గా ఉంది. రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ సూచీ 3 శాతానికి పైగా లాభపడి అగ్రస్థానంలో నిలిచింది. ప్రైవేట్ బ్యాంకులు, ఫార్మా, ఆర్థిక సేవల రంగాల షేర్లు కూడా మంచి లాభాలను నమోదు చేశాయి. అయితే మెటల్, మీడియా, కెమికల్స్, రియాల్టీ, టెలికాం రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. విస్తృత మార్కెట్ సూచీలు కూడా ఎక్కువగా లాభాల బాటలోనే కొనసాగాయి.
స్థిరంగా చమురు ధరలు..
వ్యక్తిగత షేర్లలో బీఎస్ఈలో హిందుస్థాన్ యూనిలీవర్, ఇండిగో, ట్రెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బీఈఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, రిలయన్స్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. కమోడిటీ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 91.17 డాలర్ల వద్ద, క్రూడ్ ఆయిల్ 81.64 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. బంగారం ధర ఔన్సుకు 3,536.04 డాలర్ల వద్ద కొనసాగింది. కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ మాట్లాడుతూ.. నిఫ్టీ 26,000 మార్కుకు చేరువైనప్పటికీ ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు. రిలయన్స్, ప్రైవేట్ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ రికవరీకి మద్దతునిచ్చాయని పేర్కొన్నారు. రూపాయి విలువ కూడా డాలర్‌తో పోలిస్తే సుమారు రూ.92.30 స్థాయికి బలపడడం సానుకూల పరిణామమని వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. 1,000 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్..
నవంబర్ 25, 2026

Nifty 500, | క్యూ2లో కంపెనీల లాభాలు 32 శాతం జంప్.. మెటల్స్, ఫైనాన్షియల్స్ హవా.. దేశీయ సూచీల దారెటు..?
నవంబర్ 24, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రూ.6.39 లక్షల కోట్ల సంపద ఆవిరి..
నవంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Lung Cancer | విషగాలి పంజా.. పొగతాగని వారిలోనూ విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్..!
- ●Tummala Nageshwar Rao | రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికత అందిస్తాం
- ●Kavitha | పాఠశాల విద్యలో ఇంటర్‌ను కలుపుతారా?.. ఇంటర్లో స్కూల్ విద్యను కలుపుతారా?: కవిత
- ●Garividi Lakshmi OTT | ఓటీటీలోకి ఉత్తరాంధ్ర జానపద గాయని బయోపిక్.. రేపటి నుంచే స్ట్రీమింగ్!
- ●Hyderabad | జేబులో పేలిన పవర్ బ్యాంక్.. కుడి కన్నుకు తీవ్ర గాయం
- ●Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు దుర్మరణం

Lung Cancer | విషగాలి పంజా.. పొగతాగని వారిలోనూ విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్..!

Tummala Nageshwar Rao | రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికత అందిస్తాం

Kavitha | పాఠశాల విద్యలో ఇంటర్‌ను కలుపుతారా?.. ఇంటర్లో స్కూల్ విద్యను కలుపుతారా?: కవిత

Garividi Lakshmi OTT | ఓటీటీలోకి ఉత్తరాంధ్ర జానపద గాయని బయోపిక్.. రేపటి నుంచే స్ట్రీమింగ్!



