త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Gandhi | వేధింపులు.. అందుకే ఆ పిల్లాడి చెంప చెళ్లుమ‌నిపించా : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi | ఎమ‌ర్జెన్సీ (Emergency) త‌ర్వాత స్కూల్‌లో ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను రాహుల్ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నెమరువేసుకున్నారు. ఆ స‌మ‌యంలో స్కూల్‌లో ఓ పిల్లాడి చెంప చెళ్లుమ‌నిపించిన‌ట్లు ప్రియాంక చెప్ప‌గా.. క్లాస్‌లో తన పక్కన కూర్చోడానికి కూడా తోటి విద్యార్థులు ఇష్ట‌ప‌డేవారు కాద‌ని రాహుల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

D

National | Published On Nov 24, 2026, 5.19 pm IST

Priyanka Gandhi | వేధింపులు.. అందుకే ఆ పిల్లాడి చెంప చెళ్లుమ‌నిపించా : ప్రియాంక గాంధీ
Advertisement

Priyanka Gandhi | త్రినేత్ర న్యూస్ : 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓటమి తర్వాత తాము స్కూల్‌కు వెళ్లిన మొదటి రోజు అనుభవాలను కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నెమరువేసుకున్నారు. ఆ స‌మ‌యంలో త‌న బాబాయ్ సంజ‌య్ గాంధీని ఉద్దేశించి తోటి విద్యార్థి "మీ బాబాయ్ జైలులో ఉన్నాడు, దొంగ" అని వేధించాడని ప్రియాంక గుర్తు చేశారు. దీంతో కోపం వ‌చ్చి ఆ పిల్లాడి చెంప చెళ్లుమ‌నిపించిన‌ట్లు చెప్పుకొచ్చారు.

తన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi) రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకంలోని కొన్ని జ్ఞాపకాల గురించి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో జరిపిన సంభాషణలో ప్రియాంక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. "ఎమర్జెన్సీ తర్వాత నానమ్మ ఇందిరా గాంధీ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు వేరే ఇంటికి మారాల్సి వ‌చ్చింది. ఆ సమయంలో ఇంట్లో చాలా ఉద్రిక్త వాతావరణం ఉండేది. అప్పుడు తొలిసారి మేము స్కూల్‌కు వెళ్లిన‌ప్పుడు ఓ చిన్న పిల్లాడు నా ద‌గ్గ‌ర‌ర‌కు వ‌చ్చి 'మీ బాబాయ్ జైల్లో ఉన్నాడు, మీ బాబాయ్ దొంగ' అన్నాడు. దాంతో నేను వాడి చెంప మీద ఒక్కటిచ్చా. అంతే వాడు ఏడుస్తూ టీచర్ దగ్గరకు వెళ్లి చెప్పడంతో నాకు తిట్లు పడ్డాయి" అని ప్రియాంక ఆ నాటి సంఘటనను నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.

నాది తిరుగుబాటు మ‌న‌స్త‌త్వం..

స్కూల్ రోజుల్లో తాను, త‌న సోద‌రి పూర్తి భిన్నంగా ఉండేవార‌మ‌ని రాహుల్ ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. ప్రియాంక ఎంతో క్రమశిక్షణతో నియమాలను పాటిస్తూ అందరితో సౌమ్యంగా ఉండేద‌ని చెప్పారు. తాను మాత్రం తిరుగుబాటు మనస్తత్వంతో ప్రశ్నలు వేస్తూ అల్ల‌రి చేసేవాడిన‌ని రాహుల్‌ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పార్ల‌మెంటులో కూడా తమ మధ్య అదే తేడా కనిపిస్తుందంటూ సోద‌రుడిని ప్రియాంక ఆట‌ప‌ట్టించారు.

స్కూల్‌లో ఒంట‌రిత‌నం..

ఎమర్జెన్సీ తర్వాత తాను స్కూల్‌కు వెళ్లినప్పుడు తన పక్కన కూర్చోడానికి కూడా తోటి విద్యార్థులు ఇష్ట‌ప‌డేవారు కాద‌ని రాహుల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తనతో ఎవరూ సరిగ్గా మాట్లాడేవారు కాదని చెప్పారు. అంతేకాకుండా, తన ఏడో పుట్టినరోజు వేడుకలకు తన స్నేహితులెవరూ రాలేదని చెప్పారు. వేడుకకు 32 మంది పిల్లలను పిలిస్తే కేవలం ఒక్క స్నేహితుడు మాత్రమే వచ్చాడని గుర్తు చేసుకున్నారు. అత‌ను ఇప్ప‌టికీ త‌నకు మంచి మిత్రుడిగా ఉన్నాడ‌ని రాహుల్ తెలిపారు.

Also Read..

పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!

బాంబు మెయిల్ ఎలా లీకైంది? అంత‌ర్గ‌తంగా వెరిఫై చేయ‌కుండా బ‌య‌ట‌కెలా వ‌చ్చింది?

కవితను ఉద్దేశించి ఆ మాట అనలేదు.. పొరపాటున దొర్లింది

Advertisement
Advertisement