Meta India head | ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు
Meta India head | సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (PM Modi) లక్ష్యంగా చేసుకొని మార్ఫింగ్ చేసిన అభ్యంతరకరమైన వీడియోలు (AI generated videos), ఫొటోలను ప్రసారం చేశారన్న ఆరోపణలపై పోలీసులు చర్యలు చేపట్టారు.
Meta India head | త్రినేత్ర.న్యూస్ : సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (PM Modi) లక్ష్యంగా చేసుకొని మార్ఫింగ్ చేసిన అభ్యంతరకరమైన వీడియోలు (AI generated videos), ఫొటోలను ప్రసారం చేశారన్న ఆరోపణలపై పోలీసులు చర్యలు చేపట్టారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ (Arun Srinivas) సహా పలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Hyderabad Cyber Crime Police) రెండు కేసులు నమోదు చేశారు.
సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నీట్ పేపర్ లీక్ ఆందోళనల సమయంలో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని మెటా ఆధ్వర్యంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), సమాచార సాంకేతిక చట్టం కింద ఉల్లంఘనలు జరిగాయా అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సీజేపీ ఆందోళనల సమయంలో విద్యార్థి నిరసనకారులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రసంగించిన ఓ వీడియో ఫేస్‌బుక్ (Facebook) నుంచి తొలగించడం (Modis selfie video removed) వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ వీడియోని మెటా పునరుద్ధరించినప్పటికీ ఈ ఘటన అప్పటికే తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రం వివరణ కోరుతూ మెటా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత మెటా ప్రతినిధులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చి, ప్రముఖ ఖాతాలకు అదనపు పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read..
కాంగ్రెస్‌కు కొత్త సమస్య.. అసెంబ్లీలో మాజీ సీఎంకు సీటు ఎక్కడ?
స్టేజ్‌పైనే కుప్పకూలిన హ్యూమనాయిడ్ రోబో.. సోషల్ మీడియాలో మీమ్స్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vakiti Srihari | ఆసియా క్రీడల్లో తరుణ్ పతకం తేవడం గర్వకారణం: మంత్రి వాకిటి
- ●Asian Games | ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు..
- ●Cockroach Janta Party | అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత: మీటింగ్‌కు ముందే సీజేపీ నేతల అరెస్ట్.. సీఎం హిమంతపై తీవ్ర ఆరోపణలు
- ●Ramayana | డివైన్ లుక్‌లో సాయిపల్లవి - రామాయణ పోస్టర్ రిలీజ్ - విమర్శలకు చెక్ పెట్టిన నాచురల్ బ్యూటీ
- ●Minister Seethakka | విద్యకు వయసుతో సంబంధం లేదు : మంత్రి సీతక్క
- ●Komati Reddy Rajagopal Reddy | నాకు మంత్రి పదవి ఇవ్వడం రేవంత్ చేతిలో లేదు

Vakiti Srihari | ఆసియా క్రీడల్లో తరుణ్ పతకం తేవడం గర్వకారణం: మంత్రి వాకిటి

Asian Games | ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు..

Cockroach Janta Party | అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత: మీటింగ్‌కు ముందే సీజేపీ నేతల అరెస్ట్.. సీఎం హిమంతపై తీవ్ర ఆరోపణలు

Ramayana | డివైన్ లుక్‌లో సాయిపల్లవి - రామాయణ పోస్టర్ రిలీజ్ - విమర్శలకు చెక్ పెట్టిన నాచురల్ బ్యూటీ






