త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon Layoffs | గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్ వేళ.. ఉద్యోగుల‌కు షాకిచ్చిన అమెజాన్‌

Amazon Layoffs | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ (Amazon) త‌న ఉద్యోగుల‌కు షాకిచ్చింది. భారీగా లేఆఫ్స్ (Layoffs) ప్ర‌క‌టించింది. భారత్, అమెరికా, బ్రిటన్ సహా ప్ర‌పంచ వ్యాప్తంగా 1000 మందిపై వేటు వేసింది.

D

National | Published On Oct 8, 2026, 12.15 pm IST

Amazon Layoffs | గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్ వేళ.. ఉద్యోగుల‌కు షాకిచ్చిన అమెజాన్‌
Advertisement

Amazon Layoffs | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ (Amazon) గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ 2026 సేల్ (Great Indian Festival Sale 2026) నేటి అర్ధ‌రాత్రి నుంచి ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సంస్థ త‌న ఉద్యోగుల‌కు షాకిచ్చింది. భారీగా లేఆఫ్స్ (Layoffs) ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 1000 మందిపై వేటు వేసింది. కంపెనీకి చెందిన ప్రధాన రిటైల్ వ్యాపారంతో సహా పలు కీలక విభాగాలపై ఈ లేఆఫ్స్ ప్ర‌భావం ప‌డింది. ఈ ఉద్యోగాల కోత ప్రభావం ప్రధానంగా భారత్, అమెరికా, బ్రిటన్ దేశాల్లోని ఉద్యోగులపై పడింది.

ఇది కూడా చ‌ద‌వండి.. అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ 2026 సేల్ డీల్స్

క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌, సెల్లింగ్ పార్ట‌న‌ర్ స‌ర్వీసెస్‌, మార్కెట్ ప్లేస్ స‌పోర్ట్‌తోపాటూ అమెజాన్ రిటైల్ ఆప‌రేష‌న్స్‌లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు తాజా లేఆఫ్స్‌కు గురైన‌ట్లు తెలిసింది. ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవ‌డం, కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే లేఆఫ్స్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సంస్థ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపిన‌ట్లు రాయిట‌ర్స్ నివేదించింది. అమెజాన్ అతిపెద్ద షాపింగ్ ఈవెంట్ అయిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభానికి కొన్ని గంట‌ల ముందు సంస్థ నుంచి ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టం గ‌మ‌నార్హం.

కాగా, కరోనా మహమ్మారి సమయంలో భారీగా సిబ్బందిని నియమించుకున్న సంస్థ‌.. ఆ త‌ర్వాత ఖర్చులను తగ్గించుకోవడానికి, సంస్థను పునర్వ్యవస్థీకరించ‌డంలో భాగంగా 2025 చివరి నుంచి 2026 జనవరి మధ్య దాదాపు 30,000 కార్పొరేట్ ఉద్యోగుల‌ను తొలగించిన విష‌యం తెలిసిందే. ఓ వైపు లేఆఫ్స్ ప్ర‌క‌టిస్తూనే మ‌రోవైపు అమెజాన్ ఆర్ఠిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తోంది. డేటా సెంటర్లు, చిప్స్, ఇత‌ర మౌలిక స‌దుపాయాల కోసం భారీగా ఖ‌ర్చు చేస్తోంది. సుమారు 220 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. రానున్న కాలంలో మరిన్ని లేఆఫ్స్ ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read..

బెంగ‌ళూరులో సీజేపీ చెప్పుల నిర‌స‌న‌.. ప్ర‌కాశ్ రాజ్ మ‌ద్ద‌తు

10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో ఎస్2 ఎఫ్ఈ.. ధర ఎంతంటే?

పాలమూరు రంగారెడ్డికి ఆ మూడు పార్టీలు మరణశాసనం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

Advertisement
Advertisement