CJP | బెంగళూరులో సీజేపీ చెప్పుల నిరసన.. ప్రకాశ్ రాజ్ మద్దతు
CJP | SIR ప్రక్రియకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతాపార్టీ (CJP) వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. బెంగళూరు (Bengaluru)లోని ఫ్రీడమ్ పార్క్ (Freedom Park)లో పీపుల్స్ ట్రిబ్యునల్ (CJP to hold peoples tribunal)తో పాటు వినూత్నంగా చెప్పుల నిరసన (Chappal Protest) నిర్వహించింది.
CJP | త్రినేత్ర న్యూస్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను అడ్డుపెట్టుకొని భారీగా ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతాపార్టీ (CJP) తన ఆందోళనలను మరింత ఉద్ధృతం చేసింది. మొన్న ముంబై వేదికగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన కాక్రోచ్ పార్టీ.. ఇవాళ బెంగళూరు (Bengaluru)లో వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది.
స్థానిక ఫ్రీడమ్ పార్క్ (Freedom Park)లో పీపుల్స్ ట్రిబ్యునల్ (CJP to hold peoples tribunal)తో పాటు వినూత్నంగా చెప్పుల నిరసన (Chappal Protest) నిర్వహించింది. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు గురైన బాధితులకు సంఘీభావంగా ఈ వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే.. ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన బాధితులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని, కన్నడిగుల పేర్లను అన్యాయంగా తొలగించారని దిప్కే ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని దిప్కే డిమాండ్ చేశారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, యూట్యూబర్ ధృవ్ రాఠీ ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న నిరసనలో ప్రకాశ్ రాజ్, ధృవ్‌తోపాటూ పలువురు జేఎన్‌యూ నాయకులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
Also Read..
పెళ్లిపీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ సీనియర్ హీరో కూతురు
పాలమూరు రంగారెడ్డికి ఆ మూడు పార్టీలు మరణశాసనం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.50 లక్షలతో 30 ఏళ్ల రిటైర్మెంట్ ఆదాయం.. ఎస్‌డబ్ల్యూపీ ఇలా ప్లాన్ చేస్తే సెట్..
తాజావార్తలు
- ●TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
- ●High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్

High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు






