త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్ర‌యాణ తేదీలు, ఆగే స్టేష‌న్ల వివ‌రాలు ఇవే..!

Special Trains | సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు భారీ డిమాండ్ ఉంటుంది. రెగ్యులర్ రైళ్లలో టికెట్లు దొరకడం కష్టంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు.

P

Telangana | Published On Nov 28, 2026, 8.48 pm IST

Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్ర‌యాణ తేదీలు, ఆగే స్టేష‌న్ల వివ‌రాలు ఇవే..!
Advertisement

Special Trains | సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు భారీ డిమాండ్ ఉంటుంది. రెగ్యులర్ రైళ్లలో టికెట్లు దొరకడం కష్టంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు మధ్య నాలుగు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డు వెళ్లే ప్రత్యేక రైలు (07119) జనవరి 10, 17 తేదీల్లో నడుస్తుంది. ఆయా ఆదివారాల్లో సాయంత్రం 4.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ప్రత్యేక రైలు (07120) జనవరి 11, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. సోమవారాల్లో మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్లు రెండుమార్గాల్లో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఒక శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఊర‌ట క‌లిగించ‌నున్నాయి.

Advertisement
Advertisement