Mallikarjun Kharge | ఆ బిల్లు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం : ఖర్గే
Mallikarjun Kharge | ఎన్డీయే ప్రభుత్వం (PM Modi) తీసుకొస్తున్న డీలిమిటేషన్ (Delimitation) బిల్లు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని కాంగ్రెస్ (Congress) పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విమర్శించారు. లోక్‌సభ స్థానాల గరిష్ట సంఖ్యను 850కి పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని శాశ్వతంగా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఒక్కసారి పూర్తి అధికారం చేతిలోకి వస్తే బీజేపీ ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ బిల్లును ఇండియా కూటమి (INDIA) పక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయని ఖర్గే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
- 400 పార్ నినాదం 800కు చేరింది
- సీట్ల సంఖ్య పెంపుతో అధికారాన్ని శాశ్వతంగా..
తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది - ప్రతిపాదిత బిల్లులో ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలను విస్మరించారు
- బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించి ఇండీ కూటమి
Mallikarjun Kharge | త్రినేత్ర న్యూస్ : మోదీ ప్రభుత్వం (PM Modi) తీసుకొస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లు (డీలిమిటేషన్ బిల్లు) ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని కాంగ్రెస్ (Congress) పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని శాశ్వతంగా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని ఆరోపించారు. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్ననేపథ్యంలో ఇండీ కూటమి (INDIA) నేతలు ఇవాళ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం కూటమి నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ స్థానాల గరిష్ట సంఖ్యను 850కి పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని శాశ్వతంగా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని విమర్శించారు. గతంలో ఇచ్చిన '400 పార్' నినాదం ఇప్పుడు '800 పార్'కు చేరిందని ఖర్గే వ్యాఖ్యానించారు. "గత ఎన్నికల్లో బీజేపీ 400 పార్ నినాదమిచ్చింది. కానీ దురదృష్టవశాత్తూ అది నెరవేరలేదు. ఇప్పుడు లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచడం ద్వారా 800 పార్ లక్ష్యంగా పెట్టుకుని నిరవధికంగా అధికారంలో కొనసాగాలని మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది" అని ఖర్గే ఆరోపించారు.
రాజ్యాంగాన్నే మార్చేసే ప్రమాదం
ప్రతిపాదిత పునర్విభజన బిల్లులో ఎస్సీ, ఎస్టీల (SC-ST) ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని, తాజా జనాభా గణన ఆధారంగా కాకుండా పాత లెక్కలతో డీలిమిటేషన్ చేపట్టడం వల్ల ఆయా వర్గాలకు రిజర్వ్‌డ్ సీట్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణలను దుర్వినియోగం చేస్తూ, సీట్ల సంఖ్యను పెంచుకోవడం ద్వారా శాశ్వతంగా అధికారంలో కొనసాగాలని ప్రభుత్వం చూస్తోందని ఖర్గే ఆరోపించారు. కేవలం సంఖ్యాబలం కోసం రాజకీయ పార్టీలను చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఒక్కసారి పూర్తి అధికారం చేతిలోకి వస్తే బీజేపీ ఏకంగా రాజ్యాంగాన్నే (democracy) మార్చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం..
లోక్‌సభ స్థానాలు ప్రస్తుతమున్న సంఖ్యలోనే ఉంచి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, రాబోయే 25 ఏళ్ల పాటు రాష్ట్రాల సీట్ల వాటాలో ఎలాంటి మార్పులు చేయకూడదని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, సర్వాధికారాలను కేంద్రీకరించేందుకు ఉద్దేశించిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఇండియా కూటమి పక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయని ఖర్గే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ భేటీలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) తరపున అభిషేక్ బెనర్జీ, ఆర్జేడీ (RJD) నుంచి మనోజ్ ఝా, అభయ్ కుమార్ సింగ్, స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్, సీపీఐ (CPI) నేత పి. సంతోష్ కుమార్, ఐయూఎంఎల్ (IUML) నేత ఇ.టి. మహ్మద్ బషీర్, ఆర్ఎస్పీ (RSP) ఎంపీ ఎన్.కె. ప్రేమచంద్రన్ తదితరులు హాజరయ్యారు. ఈ కీలక సమావేశానికి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఆప్, డీఎంకే దూరంగా ఉన్నాయి. ఎన్సీపీ, డీఎంకే ఇప్పటికే ఈ బిల్లులకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇండీ కూటమి మూడు ప్రధాన డిమాండ్లు
ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రతిపక్ష ఇండీ (INDIA) కూటమి శనివారం మూడు ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. ప్రస్తుత లోక్‌సభ సభ్యుల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలని, ఉన్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, వచ్చే 25 ఏళ్ల పాటు రాష్ట్రాల మధ్య సీట్ల కేటాయింపులో ఎలాంటి మార్పు చేయకూడదని స్పష్టం చేసింది.
Also Read..
పాఠశాలలో భారీ పేలుడు.. ఆరుగురు చిన్నారులు మృతి
ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గింపుపై పిటిషన్.. విచారణకు సుప్రీం నో
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు
- ●IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..? మద్దతు ప్రకటించిన మాజీలు..!
- ●Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం

Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!

Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు






