త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon Great Indian Festival 2026 | అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ 2026 సేల్ డీల్స్ రివీల్‌.. ఫోన్ల‌పై 40 శాతం డిస్కౌంట్‌..

Amazon Great Indian Festival 2026 | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ అక్టోబ‌ర్ 8 నుంచి నిర్వ‌హించ‌నున్న గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ 2026 సేల్‌లో అందించ‌నున్న డీల్స్, డిస్కౌంట్లు, ఆఫ‌ర్ల వివ‌రాల‌ను తెలియ‌జేసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అండ్ కిచెన్ ఉత్పత్తులు, రోజువారీ అవసరాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందించనున్నారు. ప్రైమ్ సభ్యులకు అదనపు ప్రయోజనాలు కూడా లభించనున్నాయి.

S

Business | Published On Oct 3, 2026, 1.05 pm IST

Amazon Great Indian Festival 2026 | అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ 2026 సేల్ డీల్స్ రివీల్‌.. ఫోన్ల‌పై 40 శాతం డిస్కౌంట్‌..
Advertisement

Amazon Great Indian Festival 2026 | ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ అక్టోబ‌ర్ 8 నుంచి నిర్వ‌హించ‌నున్న గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ 2026 సేల్‌లో అందించ‌నున్న డీల్స్, డిస్కౌంట్లు, ఆఫ‌ర్ల వివ‌రాల‌ను తెలియ‌జేసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అండ్ కిచెన్ ఉత్పత్తులు, రోజువారీ అవసరాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందించనున్నారు. ప్రైమ్ సభ్యులకు అదనపు ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. శామ్‌సంగ్ గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్8 5జి 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,79,999గా ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం47 5జి 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ రూ.30,999కు, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం17ఈ 5జి 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ రూ.14,999కు లభించనున్నాయి. ఐక్యూ జ‌డ్11 5జి 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999గా ఉంది. ఐటెల్ జెనో 100 ప్రొ 3 జీబీ ర్యామ్‌తోపాటు 5 జీబీ వర్చువల్ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ రూ.7,739కు అందుబాటులో ఉండ‌నుంది.

ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం డిస్కౌంట్‌..

ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ తెలిపింది. యాపిల్ మ్యాక్ మినీ విత్ యాపిల్ ఎం6 చిప్ రూ.94,400కు లభించనుంది. దీనిపై ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ద్వారా అదనంగా రూ.5,500 వరకు తగ్గింపు పొందవచ్చు. యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ ఎం4 ధర రూ.67,999గా ఉంది. ఏఎండీ రైజెన్ 7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ, 16 ఇంచుల డిస్‌ప్లేతో ఉన్న హెచ్‌పీ విక్టస్ ల్యాప్‌టాప్ ధర రూ.93,990గా ఉంది. బ్యాంక్ ఆఫర్‌తో రూ.8వేల వరకు తగ్గింపు లభిస్తుంది. జేబీఎల్ బార్ 800 ప్రొ సౌండ్‌బార్ రూ.54,999కు, షియోమీమీ ప్యాడ్ 8 క్రియేటర్స్ ఎడిషన్ రూ.42,999కు లభించనున్నాయి.

టీవీల‌పై 65 శాతం వ‌ర‌కు త‌గ్గింపు..

స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై 65 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు. 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, కూపన్లు కూడా అందుబాటులో ఉంటాయి. టీసీఎల్ 65 ఇంచుల 4కె క్యూడీ మినీ ఎల్‌ఈడీ గూగుల్ టీవీ ధర రూ.63,999గా ఉంది. షియోమీ 55 ఇంచుల ఎఫ్ఎక్స్ ప్రొ 4కె క్యుఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ.29,999కు, సోనీ 55 ఇంచుల బ్రావియా 2ఎం2 సిరీస్ 4కె గూగుల్ టీవీ రూ.56,990కు లభించనుంది. శామ్‌సంగ్ 65 ఇంచుల క్రిస్టల్ 4కె విజన్ ఏఐ 2026 స్మార్ట్ టీవీ ధర రూ.44,990గా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించే ప్రైమ్ సభ్యులకు కొనుగోళ్లపై అపరిమిత 5 శాతం క్యాష్‌బ్యాక్, నాన్ ప్రైమ్ సభ్యులకు 3 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

బ్యాంకు ఆఫర్లు సైతం..

ప్రైమ్ సభ్యులు లక్షలాది ఉత్పత్తులపై అదనంగా రూ.250 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొత్త వినియోగదారులకు రూ.2,500 వరకు వెల్‌కమ్ రివార్డులు, జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు లేకుండా అందించనున్నారు. అమెజాన్ పే లేటర్ ద్వారా ఎంపిక చేసిన కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్, రూ.1,500 లేదా అంతకంటే ఎక్కువ కార్ట్ విలువపై మూడు వడ్డీ రహిత ఈఎంఐలు, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా సదుపాయం ఉంటాయి. అమెజాన్ పే బ్యాలెన్స్‌తో రూ.300 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్లపై ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అండ్ కిచెన్ విభాగాల్లో ఫ్లాట్ రూ.20 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. బిల్ చెల్లింపులపై తొలిసారి షాపింగ్ చేసే వారికి రూ.500 వరకు రివార్డులు, రీచార్జ్‌లు, బిల్లులపై రూ.50 వరకు క్యాష్‌బ్యాక్ అందించనున్నారు. అమెజాన్ పే ట్రావెల్ ద్వారా ప్రైమ్ సభ్యులు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే విమానాలు, హోటళ్లలో 15 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. విమాన టికెట్లపై 23 శాతం వరకు, హోటళ్లపై 75 శాతం వరకు, బస్ బుకింగ్‌లపై 17 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు రూ.100 క్యాష్‌బ్యాక్, ఎంపిక చేసిన ఫ్లాష్ సేల్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ అక్టోబర్ 8 నుంచి వినియోగదారులకు ప్రారంభం కానుంది. అయితే పలు విభాగాల్లో ప్రారంభ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అన్ని డీల్స్, ఆఫర్లను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ స్టోర్‌ఫ్రంట్‌లో చూసి తెలుసుకోవ‌చ్చు.

Advertisement
Advertisement