త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crime News | ఎల్‌బీనగర్‌లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

Crime News | ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ నగదు దోపిడీ కలకలం రేపింది. మాన్సూరాబాద్‌లోని చండిశ్వర్ కాలనీలో ఓ ఇంట్లో భద్రపరిచిన రూ.3.20 కోట్ల నగదును నలుగురు ముసుగు దొంగలు అపహరించారు. ఇంట్లో ఉన్న వృద్ధురాలు, ఆమె కోడలిని బంధించి మరీ ఈ దోపిడీకి పాల్పడ్డారు.

P

Hyderabad | Published On Nov 28, 2026, 10.20 pm IST

Crime News | ఎల్‌బీనగర్‌లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
Advertisement

Crime News | ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ నగదు దోపిడీ కలకలం రేపింది. మాన్సూరాబాద్‌లోని చండిశ్వర్ కాలనీలో ఓ ఇంట్లో భద్రపరిచిన రూ.3.20 కోట్ల నగదును నలుగురు ముసుగు దొంగలు అపహరించారు. ఇంట్లో ఉన్న వృద్ధురాలు, ఆమె కోడలిని బంధించి మరీ ఈ దోపిడీకి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న కొమ్మరవెల్లి సంపత్ కుమార్ రెడ్డి భారత్‌లో స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు రూ.3.20 కోట్లను తన బావమరిది కుంభం విజయ్ కుమార్ రెడ్డి ఖాతాకు బదిలీ చేశారు. ఆయన ఆ నగదును డ్రా చేసి ఈ నెల 22న మాన్సూరాబాద్‌లోని చండిశ్వర్ కాలనీ, రోడ్డు నంబర్ 2, ప్లాట్ నంబర్ 61లో నివసించే సామ ప్రవీణ్ ఇంట్లో భద్రపరిచారు.

కుటుంబ సభ్యులు బంధువుల వివాహానికి వెళ్లాల్సి ఉండటంతో నగదును అక్కడే ఉంచారు. ఈ నెల 28న మధ్యాహ్నం నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 65 ఏళ్ల సామ మాణెమ్మ, ఆమె కోడలు మౌనిక చేతులను కట్టేసి, కేకలు వేయకుండా నోటికి ప్లాస్టర్ వేశారు. అనంతరం బెడ్‌రూంలోని బీరువాను బలవంతంగా పగులగొట్టి అందులో ఉన్న రూ.3.20 కోట్ల నగదును ఎత్తుకెళ్లారు. బాధితురాలు మాణెమ్మ ఫిర్యాదుతో ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి పరిశీలిస్తున్నారు. నిందితులు ఎటువైపు పరారయ్యారనే దానిపై ఆరా తీస్తున్నారు. దోపిడీకి పాల్పడిన వారిని గుర్తించి పట్టుకోవడంతో పాటు అపహరణకు గురైన నగదును స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశం తెలిపారు.

Advertisement
Advertisement