త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS NRI | డీలిమిటేషన్‌లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్‌ బిగాల

BRS NRI | డీలిమిటేషన్ అంశంపై బీఆర్‌ఎస్ వెల్లడించిన వైఖరికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడంతోపాటు 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కాపాడేలా రక్షణ ఉండటం కీలకమని పేర్కొన్నారు.

P

Telangana | Published On Nov 28, 2026, 9.59 pm IST

BRS NRI | డీలిమిటేషన్‌లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్‌ బిగాల
Advertisement

BRS NRI | డీలిమిటేషన్ అంశంపై బీఆర్‌ఎస్ వెల్లడించిన వైఖరికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడంతోపాటు 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కాపాడేలా రక్షణ ఉండటం కీలకమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన అమలైతే తెలంగాణలో లోక్‌సభ స్థానాలు ప్రస్తుతమున్న 17 నుంచి 26కు పెరిగే అవకాశం ఉందన్నారు. తద్వారా జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ప్రాతినిధ్యం మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.

చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, డీలిమిటేషన్‌పై జరిగిన చర్చల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం గళమెత్తారని గుర్తుచేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా, న్యాయబద్ధంగా జరగాలని ఆకాంక్షించారు. లోక్‌సభ స్థానాల పెంపుతో జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని, కేసీఆర్ మరోసారి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని మహేశ్‌ బిగాల పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్ మొదటి నుంచీ మద్దతుగా ఉందని, వాటి సమర్థవంతమైన అమలుకు పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. డీలిమిటేషన్ అనేది కేవలం నియోజకవర్గాల సంఖ్యకు సంబంధించిన అంశం కాదని, దేశ సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాల మధ్య సమానత్వం, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం, భవిష్యత్ తరాల హక్కులతో ముడిపడిన కీలక అంశమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని, పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల గొంతుక మరింత బలంగా వినిపించాలని, సమాఖ్య స్ఫూర్తిని కాపాడటం అందరి బాధ్యతని మహేశ్‌ బిగాల స్పష్టం చేశారు.

Advertisement
Advertisement