త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

vivo S2 FE | 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో ఎస్2 ఎఫ్ఈ.. ధర ఎంతంటే?

vivo S2 FE | భారత మార్కెట్లో వివో ఎస్ సిరీస్ విస్తరణలో భాగంగా వివో ఎస్2 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారికంగా పరిచయం చేసింది. ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్, నాణ్యమైన డిస్‌ప్లే, ఆకర్షణీయమైన డిజైన్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో ఎస్2 ఎఫ్ఈలో ప్రధాన ఆకర్షణ 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని ప్రదర్శించే పరీక్షలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది.

S

Technology | Published On Oct 8, 2026, 11.48 am IST

vivo S2 FE | 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో ఎస్2 ఎఫ్ఈ.. ధర ఎంతంటే?
Advertisement

vivo S2 FE | భారత మార్కెట్లో వివో ఎస్ సిరీస్ విస్తరణలో భాగంగా వివో ఎస్2 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారికంగా పరిచయం చేసింది. ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్, నాణ్యమైన డిస్‌ప్లే, ఆకర్షణీయమైన డిజైన్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో ఎస్2 ఎఫ్ఈలో ప్రధాన ఆకర్షణ 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని ప్రదర్శించే పరీక్షలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది. లాంగెస్ట్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ టెస్టింగ్ లైవ్‌స్ట్రీమ్ విభాగంలో ఏకధాటిగా 32 గంటల 37 నిమిషాల పాటు పనిచేసి ఈ రికార్డును నమోదు చేసింది. డిస్‌ప్లే విషయానికి వస్తే ఫోన్‌లో 6.83 ఇంచుల 1.5కె అమోలెడ్ స్క్రీన్ ఇచ్చారు. ఇది 1260 * 2800 పిక్స‌ల్స్ రిజల్యూషన్, హెచ్‌డీఆర్10 ప్ల‌స్ క్వాలిటీ, 120 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గరిష్ఠంగా 2,000 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్ అందించడం వల్ల ఔట్ డోర్‌లోనూ స్క్రీన్‌ను సులభంగా చూడవచ్చని కంపెనీ చెబుతోంది.

ప‌వ‌ర్‌ఫుల్ కెమెరాలు..

డిజైన్ పరంగా వివో ఎస్2 ఎఫ్ఈ మూడు రంగుల్లో లభిస్తుంది. స్టెల్లార్ గ్రీన్, జెన్ వైట్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టైటాన్ బ్లాక్, స్టెల్లార్ గ్రీన్ వేరియంట్ల మందం 8.59 మిల్లీమీటర్లు కాగా, జెన్ వైట్ వేరియంట్ మందం 8.69 మిల్లీమీటర్లుగా ఉంది. బరువు 224 నుంచి 225 గ్రాముల మధ్య ఉంటుంది. పనితీరు కోసం 6 నానోమీటర్ టెక్నాలజీతో రూపొందించిన మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఈ ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 2.5 గిగాహెడ్జ్‌ క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. ఫోన్ 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్‌ఓఎస్ 6తో ఫోన్ వస్తుంది. డ్యుయల్ నానో సిమ్ సపోర్ట్, ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్టీరియో స్పీకర్లు, యూఎస్‌బీ టైప్ సి ఆడియోను కూడా అందించారు. వెనుక భాగంలో 50 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరా ఉంది. 2 మెగాపిక్స‌ల్ సెకండరీ కెమెరా, ఆరా లైట్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరాను అందించారు.

ధ‌ర ఎంతంటే..

బలమైన నిర్మాణం కోసం వివో ఎస్2 ఎఫ్ఈకి ఐపీ68, ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఇచ్చారు. మిలిటరీ గ్రేడ్ మన్నికకు సంబంధించిన ప్రమాణాలను కూడా ఫోన్ క‌లిగి ఉంది. 5జి, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సి కనెక్టివిటీ ఉన్నాయి. భారీ బ్యాటరీకి 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. కంపెనీ పేర్కొన్న బ్యాటరీ సామర్థ్యం కనీసం 10,000 ఎంఏహెచ్. దీంతో ఎక్కువసేపు వీడియోలు చూడడం, గేమింగ్, సోషల్ మీడియా వినియోగం వంటి పనులకు ఎక్కువ బ్యాకప్ లభించేలా ఫోన్‌ను రూపొందించారు. వివో ఎస్2 ఎఫ్ఈ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.38,999గా నిర్ణయించారు. ఇక 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999గా ఉంది. ఫోన్ విక్రయాలు అక్టోబర్ 20 నుంచి ప్రారంభమవుతాయి. వివో అధికారిక వెబ్‌సైట్‌తోపాటు భాగస్వామ్య రిటైల్ స్టోర్లు, అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

లాంచ్ ఆఫ‌ర్లు సైతం..

లాంచ్ ఆఫర్లలో భాగంగా ఆఫ్‌లైన్ కొనుగోలుదారులకు ప్రధాన బ్యాంకులు, క్రెడిట్ భాగస్వాములు, యూపీఐ ద్వారా గరిష్ఠంగా 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా 15 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ కొనుగోలుదారులకు 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, 10 శాతం ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అదనంగా కొనుగోలుదారులకు ఉచితంగా ఒక సంవత్సరం ఎక్స్‌టెండెడ్ వారంటీ లభిస్తుంది. రిటైల్ స్టోర్లలో వి-షీల్డ్ స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. అన్ని యూనిట్లతో ఆరు నెలల పాటు 100జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. అర్హత కలిగిన జియో ప్రీపెయిడ్ రీఛార్జ్‌లతో ఆరు నెలల పాటు 10 ప్రీమియం ఓటీటీ అప్లికేషన్లకు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తున్నారు. అలాగే వార్షిక జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లపై 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మొబైల్ ప్లాన్ రూ.249.50కే, సూపర్ ప్లాన్ రూ.549.50కే పొందే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement