త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AIIMS | పార్కిన్సన్‌ చికిత్సలో సరికొత్త ముందడుగు..

AIIMS | పార్కిన్సన్‌ వ్యాధి చికిత్సలో భారత్‌ సరికొత్త ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారిగా రోబోటిక్‌ గైడెడ్‌ డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ (డీబీఎస్‌) విధానాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ సహకారంతో ఈ వినూత్న చికిత్స చేపట్టినట్లు ఎయిమ్స్‌ శనివారం వెల్లడించింది.

P

National | Published On Nov 28, 2026, 9.35 pm IST

AIIMS | పార్కిన్సన్‌ చికిత్సలో సరికొత్త ముందడుగు..
Advertisement
  • దేశంలోనే తొలిసారి రోబోటిక్‌ గైడెడ్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌
  • ఢిల్లీ ఎయిమ్స్‌లో విజయవంతంగా నిర్వహణ

AIIMS | పార్కిన్సన్‌ వ్యాధి చికిత్సలో భారత్‌ సరికొత్త ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారిగా రోబోటిక్‌ గైడెడ్‌ డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ (డీబీఎస్‌) విధానాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ సహకారంతో ఈ వినూత్న చికిత్స చేపట్టినట్లు ఎయిమ్స్‌ శనివారం వెల్లడించింది. ఎయిమ్స్‌కు చెందిన ప్రొఫెసర్ పీ శరత్‌ చంద్ర, టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఇడో స్ట్రాస్‌ నేతృత్వంలోని వైద్య బృందాలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. మెదడులోని నిర్దిష్ట ప్రాంతాల్లో విద్యుత్‌ ప్రేరణ అందించే ఎలక్ట్రోడ్‌లను అత్యంత కచ్చితత్వంతో అమర్చేందుకు రోబోటిక్‌ సాంకేతికత ఉప‌యోగ‌ప‌డుతుంది.

పేస్‌మేకర్‌ తరహాలోనే డివైజ్‌..

ఈ చికిత్సలో మెదడులో అమర్చిన ఎలక్ట్రోడ్‌ల ద్వారా విద్యుత్‌ సంకేతాలు పంపిస్తారు. ఛాతీ పైభాగంలో చర్మం కింద అమర్చే చిన్న పరికరం (పేస్‌మేకర్‌ తరహా) వీటిని నియంత్రిస్తుంది. చర్మం కింద ఉండే వైర్‌ ద్వారా ఈ పరికరం మెదడులోని ఎలక్ట్రోడ్‌లకు అనుసంధానమవుతుంది. తద్వారా మెదడు కార్యకలాపాల్లో మార్పులు తీసుకొచ్చి వ్యాధి లక్షణాలను నియంత్రించేందుకు ఈ విధానం తోడ్పడుతుంది. పార్కిన్సన్‌తో పాటు ఎసెన్షియల్‌ ట్రెమర్‌, డిస్టోనియా, ఎపిలెప్సీ, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌, టూరెట్‌ సిండ్రోమ్‌ చికిత్సలోనూ డీబీఎస్‌ విధానాన్ని ఉపయోగిస్తున్నారు.

మరో పరిశోధనలోనూ ఎయిమ్స్‌ ముందడుగు

ఇటీవల గ్లియోబ్లాస్టోమా అనే వేగంగా విస్తరించే మెదడు క్యాన్సర్‌ పురోగతిని నెమ్మదింపజేసే కొత్త విధానంపై ఎయిమ్స్‌ న్యూరోసర్జరీ విభాగం పైలట్‌ అధ్యయనం నిర్వహించింది. మరోవైపు, భాషా సమస్యలు లేకుండా వైద్యులు, రోగుల మధ్య సంభాషణలకు వీలుగా భాషిణి సాంకేతికతను కూడా ఎయిమ్స్‌లో ప్రదర్శించారు. వైద్యుల మాటలను టెక్స్ట్‌గా మార్చే వాయిస్‌ ఆధారిత డాక్యుమెంటేషన్‌ విధానం ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement
Advertisement