HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్‌లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
HMDA | హైదరాబాద్‌లో భూముల కొనుగోలుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ మరోసారి ప్లాట్ల ఈ-వేలానికి సిద్ధమైంది. శంకరపల్లి సమీపంలోని మోకిల లేఅవుట్ ఫేజ్-5లో 61 ఓపెన్ ప్లాట్లను విక్రయించనుంది. డిసెంబర్ 15న ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ-వేలానికి సంబంధించి శనివారం ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించింది.
HMDA | హైదరాబాద్‌లో భూముల కొనుగోలుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ మరోసారి ప్లాట్ల ఈ-వేలానికి సిద్ధమైంది. శంకరపల్లి సమీపంలోని మోకిల లేఅవుట్ ఫేజ్-5లో 61 ఓపెన్ ప్లాట్లను విక్రయించనుంది. డిసెంబర్ 15న ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ-వేలానికి సంబంధించి శనివారం ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించింది. ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునే పలువురు ఆసక్తిదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సర్వే నంబర్ 96/పీ పరిధిలోని ప్లాట్లకు సంబంధించిన మాస్టర్ ప్లాన్, అంతర్గత రహదారులు, సమీప ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలపై హెచ్ఎండీఏ అధికారులు వివరించారు.
ఆన్‌లైన్ బిడ్డింగ్ విధానం, తాగునీరు, విద్యుత్ వసతులు, ఈఎండీ చెల్లింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు భవన నిర్మాణ నిబంధనలపై బిడ్డర్ల సందేహాలను నివృత్తి చేశారు. డిసెంబర్ 15న రెండు విడతల్లో ఈ-వేలం జరగనుంది. మొదటి సెషన్ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు డిసెంబర్ 14లోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, నిర్దేశిత ఈఎండీ మొత్తాన్ని చెల్లించాలి. ప్లాట్ల విస్తీర్ణం, లేఅవుట్ బ్రోచర్, వేలం నిబంధనలు, ఇతర మార్గదర్శకాలను హెచ్ఎండీఏ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సందేహాల నివృత్తికి 7416835522 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. మోకిల పరిసరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి నేపథ్యంలో ఈ ప్లాట్ల వేలంపై ఆసక్తి నెలకొంది.
సంబంధిత వార్తలు

Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
నవంబర్ 28, 2026

IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..? మద్దతు ప్రకటించిన మాజీలు..!
నవంబర్ 28, 2026

Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు
- ●IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..? మద్దతు ప్రకటించిన మాజీలు..!
- ●Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్
- ●Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన
- ●Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్

Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!

Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..? మద్దతు ప్రకటించిన మాజీలు..!

Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్



