త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పెద్ద కుట్ర: క‌ల్వ‌కుంట్ల క‌విత‌

G

Telangana | Published On Apr 16, 2026, 11.00 am IST

Kavitha | మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పెద్ద కుట్ర: క‌ల్వ‌కుంట్ల క‌విత‌
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును (Delimitation Bill) కాల్చే ప్రయత్నం చేస్తున్నార‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha) విమ‌ర్శించారు. మహిళా బిల్లుకు (Women's Reservation Bill) డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడంలో పెద్ద కుట్ర ఉంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణకు (Telangana) రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకునేది లేదని స్ప‌ష్టం చేశారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా ఉండాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

`పార్లమెంట్‌లో నేడు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరగనుంది. ఇది కచ్చితంగా మన మహిళలకు చాలా ముఖ్యమైన రోజు. అదే విధంగా నియోజకవర్గాల పెంపు పై కూడా చర్చ చేయనున్నారు. కానీ మహిళ బిల్లును ఇప్పటికే పాస్ చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్‌ను మహిళా బిల్లుకు లింక్ చేస్తూ కేంద్రం కుట్ర చేస్తోంది. మహిళా బిల్లు, డీలిమిటేషన్ అనేవి రెండు వేర్వేరు అంశాలు. మహిళల భుజంపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం భావిస్తోంది.

నియోజకవర్గాలను బ్లాంకెట్‌గా 50 శాతం పెంచుతామని చెబుతున్న‌ది. చూడటానికి ఇది కరెక్టే అనిపించినప్పటికీ చాలా నష్టం జరగుతుంది. బీహార్ లాంటి రాష్ట్రాలో పెరిగిన సీట్లతో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ సీట్లు ఉంటాయి. కచ్చితంగా తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుంది. ప్రస్తుతం పార్లమెంట్‌లో తెలంగాణకు 3.13 శాతం ప్రాతినిధ్యం ఉంది. డీలిమిటేషన్‌కు ఏ ప్రాతిపదికన తెచ్చిన సరే తెలంగాణకు 3.13 శాతం వాటా తగ్గొద్దు. లేదంటే రాష్ట్ర‌ ప్రజలు మరో తెలంగాణ మాదిరి ఉద్యమం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదు. ఇంకా మన రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే మరింత నష్టపోవాల్సి ఉంటుంది. మహిళ బిల్లుకు డీలిమిటేషన్‌ను లింక్ చేయడం కాదు. మహిళా బిల్లుకు బీసీ సబ్ కోటాను లింక్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా.` అని క‌విత అన్నారు.

Read Also.. 

మీకు పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌లో ఖాతా ఉందా.. అయితే క్లోజ్ అయిన‌ట్టే!.. ఒక్క‌సారి చెక్‌చేసుకోండి!

డీలిమిటేష‌న్ బిల్లు కాపీల‌ను త‌గ‌ల‌బెట్టిన సీఎం స్టాలిన్‌

రాష్ట్ర జ‌నాభాలో ఆ కుల‌స్థులు 4.8 శాతం.. మొత్తం భూముల్లో 13.5 శాతం వారివ‌ద్దే..

చారిత్రాత్మ‌క అడుగు.. పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల‌పై ప్ర‌ధాని మోదీ ట్వీట్‌

 

 

 

Advertisement
Advertisement