త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PNB | మీకు పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా.. అయితే ఖాతా క్లోజ్ అయిన‌ట్టే!.. ఒక్క‌సారి చెక్‌ చేసుకోండి!

PNB | త్రినేత్ర‌.న్యూస్‌: మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లో అకౌంట్ (PNB Account) ఉందా?. ఈ-కేవైసీ పూర్తి చేశారా?.. అయితే వెంట‌నే ఆ ప‌నిచేయండి. లేదంటే మీ ఖాతా క్లోజ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఎందుకంటే మూడేండ్లుగా వినియోగంలో (Inactive Bank Account) లేని, జీరో బ్యాలెన్స్ అకౌంట్ల‌ను మూసివేయాల‌ని బ్యాంకు నిర్ణ‌యించింది. అది కూడా గురువారం (ఏప్రిల్ 16) నుంచే..

G

Business | Published On Apr 16, 2026, 10.45 am IST

PNB | మీకు పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా.. అయితే ఖాతా క్లోజ్ అయిన‌ట్టే!.. ఒక్క‌సారి చెక్‌ చేసుకోండి!
Advertisement

PNB | త్రినేత్ర‌.న్యూస్‌: మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లో అకౌంట్ (PNB Account) ఉందా?. ఈ-కేవైసీ పూర్తి చేశారా?.. అయితే వెంట‌నే ఆ ప‌నిచేయండి. లేదంటే మీ ఖాతా క్లోజ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఎందుకంటే మూడేండ్లుగా వినియోగంలో (Inactive Bank Account) లేని, జీరో బ్యాలెన్స్ అకౌంట్ల‌ను మూసివేయాల‌ని బ్యాంకు నిర్ణ‌యించింది. అది కూడా గురువారం (ఏప్రిల్ 16) నుంచే ఆ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తున్న‌ది. అందుకే ఒక‌సారి అకౌంట్‌ను చెక్ చేసుకొని, వాడుక‌లో లేన‌ట్ల‌యితే వెంట‌నే మీ బ్రాంచ్‌కు వెళ్లి కేవైపీ (KYC) పూర్తి చేయండి. స‌మీపంలోని బ్రాంచ్‌లో ఆధార్, పాన్ కార్డును స‌మ‌ర్పించండి. కనీసం ఒక లావాదేవీ చేయండి.

చాలా కాలంగా వాడని అకౌంట్లపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, ఎలాంటి లావాదేవీలు, జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లే క్లోజ్ అయ్యే అవ‌కాశం ఉందని ఇప్ప‌టికే బ్యాంక్ త‌న వినియోగ‌దారుల‌కు తెలిపింది. ఈ నెల 15 నాటికి కేవైసీ పూర్తి చేయ‌ని ఖాతాలు ఎలాంటి నోటీసు లేకుండా క్లోజ్‌ అవుతాయని వెల్ల‌డించింది. కాబ‌ట్టి బుధ‌వారమే ఈ గ‌డువు ముగిసిపోయింది. ఇప్ప‌టికీ కేవైసీ స‌మ‌ర్పించ‌పోతే.. వెంట‌నే మీ ఖాతా ఉన్న బ్రాంచ్‌ను సంప్ర‌దించండి.

ఎందుకు క్లోజ్ చేస్తున్నారంటే..

బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరచడం, ఇన్ యాక్టివ్‌గా ఉన్న‌ అకౌంట్లతో నష్టాలను తగ్గించడం దీని ప్ర‌ధాన‌ లక్ష్యం. ఇన్ యాక్టివ్ అకౌంట్లతో మోసాలు, దుర్వినియోగం, అనధికారికంగా వినియోగించే రిస్క్ ఎక్కువగా ఉంటుంద‌ని బ్యాంకు అధికారులు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలోనే ప్రతి అకౌంట్ కేవైసీ రికార్డులను మెయింటేన్‌ చేయడం, ఖాతాదారుల వివరాలు వెరిఫై చేయడం వంటివి తప్పనిసరి చేసినట్టు తెలిపారు.

Read Also.. 

ప‌నిచేయ‌ని జ‌ల‌మండలి క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్‌.. నీటి ట్యాంక‌ర్ ఎలా బుక్ చేయాలంటే?

రాష్ట్ర జ‌నాభాలో ఆ కుల‌స్థులు 4.8 శాతం.. మొత్తం భూముల్లో 13.5 శాతం వారివ‌ద్దే..

చారిత్రాత్మ‌క అడుగు.. పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల‌పై ప్ర‌ధాని మోదీ ట్వీట్‌

ఎగ్జిబిష‌న్ ప్రారంభోత్స‌వానికి మువ్వన్నెల రిబ్బన్‌.. క‌ట్‌చేసేది లేద‌న్న సీఎం..

 

Advertisement
Advertisement