త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | చారిత్రాత్మ‌క అడుగు.. పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల‌పై ప్ర‌ధాని మోదీ ట్వీట్‌

PM Modi | పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు (Parliament Special Session) మ‌రికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఎక్స్ వేదిక‌గా ఓ ట్వీట్ పెట్టారు.

D

National | Published On Apr 16, 2026, 10.31 am IST

PM Modi | చారిత్రాత్మ‌క అడుగు.. పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల‌పై ప్ర‌ధాని మోదీ ట్వీట్‌
Advertisement

PM Modi | పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు (Parliament Special Session) మ‌రికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 నుంచి 18 వ‌ర‌కు మూడు రోజుల‌పాటు జ‌రుగ‌నున్న ఈ స‌మావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు (womens reservation bill), నారీశక్తి వందన్ చట్టసవరణ, లోక్‌స‌భ స్థానాల పెంపు (Delimitation Bill) వంటి కీలక బిల్లులు చ‌ర్చ‌కు రానున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఎక్స్ వేదిక‌గా ఓ ట్వీట్ పెట్టారు.

ఈ ప్ర‌త్యేక స‌మావేశాల‌ను మ‌హిళా సాధికార‌త దిశ‌గా ఓ చారిత్రాత్మ‌క అడుగుగా అభివ‌ర్ణించారు. మ‌హిళ‌ల‌కు ఇచ్చే గౌర‌వ‌మే దేశానికి మ‌నం ఇచ్చే గౌర‌వం అని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి, దృఢ నిశ్చ‌యంతో ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంద‌ని తెలిపారు. "నేటి నుంచి పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. మహిళా సాధికారత దిశగా నేడు దేశం చరిత్రాత్మక ముందడుగు వేసేందుకు సిద్ధంగా ఉంది. మ‌న త‌ల్లులు, సోద‌రీమ‌ణుల ప‌ట్ల మ‌న‌కు ఉన్న గౌర‌వ‌మే దేశానికి మ‌నం ఇచ్చే గౌర‌వం. ఇదే స్ఫూర్తితో ఆ దిశ‌గా ముందుకు వెళ్తున్నాము" అని ప్రధాని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read..

ప‌నిచేయ‌ని జ‌ల‌మండలి క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్‌.. నీటి ట్యాంక‌ర్ ఎలా బుక్ చేయాలంటే?

సంభ‌వం అధ్యాయం ఒన్ను రివ్యూ - ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం టైమ్ ట్రావెల్ మూవీ

రాష్ట్ర జ‌నాభాలో ఆ కుల‌స్థులు 4.8 శాతం.. మొత్తం భూముల్లో 13.5 శాతం వారివ‌ద్దే..

Advertisement
Advertisement