Caste Census | రాష్ట్ర జనాభాలో ఆ కులస్థులు 4.8 శాతం.. మొత్తం భూముల్లో 13.5 శాతం వారివద్దే..
Caste Census | రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన వివరాలను (Caste Census) ప్రభుత్వం బహిర్గతం చేసింది. దీనిప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా మాదిగలు ఉన్నారు. మొత్తం జనాభాలో 36 లక్షల 57 వేల 551 మంది (10.3%)తో వారే అగ్రస్థానంలో ఉండగా, మొత్తం భూముల్లో (Lands) సగానికి పైగా కేవలం 7 కులాల చేతుల్లోనే ఉన్నాయి.
Caste Census | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన వివరాలను (Caste Census) ప్రభుత్వం బహిర్గతం చేసింది. దీనిప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా మాదిగలు ఉన్నారు. మొత్తం జనాభాలో 36 లక్షల 57 వేల 551 మంది (10.3%)తో వారే అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత ముదిరాజ్, లంబాడి, యాదవ, రెడ్డి, గౌడ్, మాల, మున్నూరుకాపు, పద్మశాలి, రజక, కురుమ, వడ్డెర, ముస్లింలు, అగ్నికుల క్షత్రియ, వైశ్య, నాయి బ్రాహ్మణ, కుమ్మర కులస్థులు ఎక్కువ శాతంలో ఉన్నట్లు తేలింది.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా 1.37 కోట్ల ఎకరాలు సాగు భూమి (Lands) ఉండగా, అందులో సగానికి పైగా కేవలం 7 కులాల చేతుల్లోనే ఉన్నాయని కులగణన సర్వేలో తేలింది. 25 కులాలకు చెందిన వారు వారి జనాభా నిష్పత్తి కన్నా ఎక్కువగా భూమి కలిగి ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 4.8 శాతం మాత్రమే ఉన్న రెడ్డి కులస్థులు 13.5 శాతం భూములతో అగ్రస్థానంలో నిలిచారు. ఇక బీసీల్లో కురుమ కులస్థుల వద్ద అత్యధికంగా 62 శాతానికి పైగా కుటుంబాలకు భూమి ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. బీసీల్లోని అరేవాళ్లు, ఎస్టీ కోయ, లంబాడీ, ఎస్సీ మాదాసి కులాల్లో 60 శాతం కుటుంబాలు ఎంతోకొంత భూమి కలిగి ఉన్నాయి. ఓసీలలో రాజులు, ముస్లింలు, జైనులు, బ్రాహ్మణులు, అయ్యంగార్ కుటుంబాల్లో 10 శాతం కన్నా తక్కువ మందికి మాత్రమే భూమి ఉందని, ఈ కులాల్లో 80 శాతం కుటుంబాలకు భూమి లేదని తేలింది. ఎస్సీ బేడ, మాదిగల్లో 80 శాతం కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉంది. ఒక కుటుంబానికి 20 ఎకరాలకన్నా పెద్ద కమతం కలిగి ఉన్న కుటుంబాలు అత్యధికంగా ఓసీ జైనుల్లో 82 శాతం, రాజుల్లో 15, బ్రాహ్మణుల్లో 6.8, బీసీ గంగిరెడ్లవారు 6 శాతం ఉన్నారు.
పెద్ద కమతాలు (5-20 ఎకరాలు)
- ఓసీ రాజులు, బ్రాహ్మణులు, కాపులు, ఎస్టీ గోండు, కోయ కులాల్లో భూమి ఉన్న వారిలో 30 శాతం కుటుంబాలకు 5 నుంచి 20 ఎకరాల వరకు భూమి ఉంది.
చిన్న కమతాలు (5 ఎకరాల లోపు)
- ఎస్సీ బేడ, మాదిగ కులాల్లో 90 శాతం కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి మాత్రమే ఉంది.
భారీ కమతాలు (20 ఎకరాల పైబడి)
- 20 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న కుటుంబాలు అత్యధికంగా జైన్లలో (8.2 శాతం), రాజుల్లో (7.5 శాతం), బ్రాహ్మణుల్లో (6.8 శాతం), బీసీ గంగిరెడ్లవారిలో (6 శాతం) ఉన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



