High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
High Court | హైదరాబాద్ (Hyderabad) ఆర్టీసీ క్రాస్ రోడ్డు (RTC X Roads) లోని బావర్చి హోటల్ వద్ద కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ కేసులో బీఆర్ఎస్ నాయకులకు శనివారం హైకోర్టు (High Court)లో భారీ ఊరట లభించింది.
High Court | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ (Hyderabad) ఆర్టీసీ క్రాస్ రోడ్డు (RTC X Roads) లోని బావర్చి హోటల్ వద్ద కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ కేసులో బీఆర్ఎస్ నాయకులకు శనివారం హైకోర్టు (High Court)లో భారీ ఊరట లభించింది. మన్నె క్రిశాంక్, జగన్ మోహన్ రావు, దినేష్ చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీష్ రెడ్డి, ముఠా జైసింహ తదితరులను అరెస్టు చేయొద్దంటూ చిక్కడపల్లి (Chikkadapally Police) పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని బీర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది జక్కుల లక్ష్మణ్ తెలిపారు.
ఇదీ కేసు నేపథ్యం..
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని బావర్చి హోటల్ (Bawarchi Hotel) వద్ద గత గురువారం రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మూడేండ్ల కింద బావర్చీ హోటల్‌లో రాహుల్‌గాంధీ తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి.. మోసం చేసిన అంశంపై బీఆర్‌ఎస్ నేతలు మన్నెక్రిశాంక్, ముఠా జైసింహ, జగన్, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.
దీనిపై కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకట తేజ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చిక్కడపల్లి పోలీసులు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మన్నె క్రిశాంక్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ కార్యకర్తలు అవమానకర వ్యాఖ్యలు చేశారని, హోటల్‌లో ఉన్న కాంగ్రెస్ నేతలపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం





