CM Stalin | డీలిమిటేషన్ బిల్లు కాపీలను తగలబెట్టిన సీఎం స్టాలిన్
CM Stalin | డీలిమిటేషన్ (Delimitation) అంశంపై కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM Stalin) తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నల్ల షర్ట్ ధరించి.. బిల్లు ప్రతులను తగలబెట్టారు. ఈ బిల్లును బ్లాక్ బిల్ (black law)గా సీఎం స్టాలిన్ అభివర్ణించారు.
CM Stalin | కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో మహిళా రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. ఈ బిల్లులపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా డీలిమిటేషన్ (Delimitation) అంశంపై కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM Stalin) తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తమిళనాడుకు అన్యాయం జరిగితే భారీ ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు కూడా. ఇక నేడు ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బిల్లు కాపీని సీఎం స్టాలిన్ తగలబెట్టారు.
త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నామక్కల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నల్ల షర్ట్ ధరించి.. నల్ల జెండాను ఎగువేశారు. బిల్లు ప్రతులను తగలబెట్టారు. ఈ బిల్లును బ్లాక్ బిల్ (black law)గా సీఎం స్టాలిన్ అభివర్ణించారు. బిల్లు ప్రతులను తగలబెడుతున్న వీడియోని స్టాలిన్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
#Delimitation: Let the flames of resistance spread across Tamil Nadu!
Let the arrogance of the fascist BJP be brought down!🔥 Then, the fire of resistance against #HindiImposition that rose from Tamil Nadu scorched Delhi. It quietened only after Delhi was forced to yield.
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 16, 2026
తమిళనాడు మౌనంగా ఉండదు : స్టాలిన్
కాగా, ఈ డీలిమిటేషన్‌ను తమిళనాడు ప్రభుత్వం తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం స్టాలిన్ కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో స్పందించారు. తమిళనాడు అన్యాయం జరిగితే భారీ ఉద్యమం చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రక్రియ తమిళనాడుకు హాని కలిగించినా, ఉత్తర రాష్ట్రాల రాజకీయ శక్తిని అసమానంగా పెంచినా రాష్ట్రంలో విస్తృత నిరసనలు జరుగుతాయి ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి తన నాయకత్వంలో భారీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సమయంలో దృష్టి వేరే చోట ఉంటుందని, మీరు ఢిల్లీలో నిశ్శబ్దంగా డీలిమిటేషన్ చేయవచ్చని అనుకోవద్దని, తమిళనాడుకు అన్యాయం జరిగితే.. దాని ఫలితం యావత్ దేశం దాన్ని అనుభవిస్తుందన్నారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి రహస్యంగా జరుగుతోందని స్టాలిన్ ఆరోపించారు. తన పార్టీ అయిన డీఎంకేను గానీ, మరే ఇతర రాజకీయ పార్టీని గానీ, రాష్ట్రాన్ని గానీ సంప్రదించలేదన్నారు. ఈ నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరుగుతుందో కూడా మాకు చెప్పలేదని విమర్శించారు.
Also Read..
మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా ఉందా.. అయితే క్లోజ్ అయినట్టే!.. ఒక్కసారి చెక్ చేసుకోండి!
చారిత్రాత్మక అడుగు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ప్రధాని మోదీ ట్వీట్
పనిచేయని జలమండలి కస్టమర్ కేర్ నంబర్.. నీటి ట్యాంకర్ ఎలా బుక్ చేయాలంటే?
సంబంధిత వార్తలు

Bandi Sanjay | బెంగాల్ ను గెలవాలే.. ఇదే మా ఆతృత: బండి సంజయ్
మే 4, 2026

MP Chamala Kiran Kumar Reddy | మహిళా రిజర్వేషన్లకు కాదు.. మేం డీలిమిటేషన్కే వ్యతిరేకం: ఎంపీ చామల
ఏప్రిల్ 19, 2026

MP Chamala Kiran Kumar Reddy | మీ విధానం క్రాస్ బ్రీడ్, క్రాస్ ఓటింగ్: హరీశ్‌రావుకు ఎంపీ చామల కౌంటర్
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



