త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన

Rahul Gandhi | డీలిమిటేషన్ పేరుతో దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచాలన్న ప్రతిపాదన వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు.

P

National | Published On Nov 28, 2026, 8.01 pm IST

Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన
Advertisement
  • ఓట్ల చోరీని కప్పిపుచ్చుకునేందుకే డీలిమిటేషన్ బిల్లు 
  • యువత ఈ సంఖ్యను గుర్తుంచుకోవాల‌న్న రాహుల్ గాంధీ
  • ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపణలు

Rahul Gandhi | డీలిమిటేషన్ పేరుతో దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచాలన్న ప్రతిపాదన వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు. ఓట్ల చోరీ ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే ఎన్నికల వ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 850 సంఖ్యను యువత గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందినప్పుడు దాని అమలుకు చర్యలు తీసుకోకుండా డీలిమిటేషన్ పేరుతో నియోజకవర్గాల పునర్విభజన ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా దేశ ఎన్నికల పటాన్ని మార్చుకునేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని ఆరోపించారు.

ప్రతిపాదిత డీలిమిటేషన్ కమిషన్ కూర్పుపైనా రాహుల్ పలు ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంపిక చేసే మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఎంపిక చేసే మరో సభ్యుడితో కమిషన్ ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి కమిషన్‌పై పూర్తి నియంత్రణ లభిస్తుందని ఆరోపించారు. కమిషన్ నిర్ణయాలను కోర్టులో సవాల్ చేసే అవకాశం కూడా ఉండదని అన్నారు. ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రభావంలో పనిచేస్తోందని విమర్శించారు.

2024 ఎన్నికల్లో ఓటు హక్కు లేని 14 కోట్ల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయని రాహుల్ ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన, బిహార్‌లో ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపు, అస్సాంలో ఎన్నికల వ్యవస్థలో మార్పులు, పశ్చిమ బెంగాల్‌లో 100కు పైగా స్థానాల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని, త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తాను నిర్వహించిన సర్వే ప్రకారం 80 శాతం మంది ప్రజలు, దాదాపు 100 శాతం మంది యువత ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని భావిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. డీలిమిటేషన్ ద్వారా ప్రతిపక్షాలకు మద్దతిచ్చే వర్గాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి రాహుల్ ఎలాంటి ఆధారాలను వెల్ల‌డించ‌లేదు.

Advertisement
Advertisement