త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karthigai Deepam lamp | సుప్రీం ఆదేశాలకు తిరుగులేదు.. రేపు అక్క‌డ దీపం వెల‌గాల్సిందే..!

Karthigai Deepam lamp | తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఉన్న వివాదాస్పద దీపతూన్ (Deepathoon) వ‌ద్ద కార్తీక దీపాన్ని (Karthigai Deepam lamp) వెలిగించ‌క‌పోవ‌డంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కొండ‌పై ఉన్న రాతి స్తంభం వ‌ద్ద రేపు జ్యోతిని వెలిగించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఉచ్చిపిళ్లయార్ మండపంలో వెలిగించిన అఖండ జ్యోతితోనే.. దీపతూన్ వ‌ద్ద కార్తీక దీపం వెలిగించాలని అధికారుల‌ను ఆదేశించింది.

D

National | Published On Nov 27, 2026, 4.07 pm IST

Karthigai Deepam lamp | సుప్రీం ఆదేశాలకు తిరుగులేదు.. రేపు అక్క‌డ దీపం వెల‌గాల్సిందే..!
Advertisement

Karthigai Deepam lamp | త్రినేత్ర న్యూస్ : మదురై (Madurai) జిల్లా తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఉన్న వివాదాస్పద దీపతూన్ (Deepathoon) రాతి స్తంభం వద్ద నవంబర్ 24న సాంప్ర‌దాయ కార్తీక దీపాన్ని (Karthigai Deepam lamp) వెలిగించ‌క‌పోవ‌డంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌మ ఆదేశాల‌ను క‌చ్చితంగా పాటించి తీరాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. కొండ‌పై ఉన్న రాతి స్తంభం వ‌ద్ద రేపు జ్యోతిని వెలిగించాల‌ని ఆదేశించింది. ఉచ్చిపిళ్లయార్ మండపంలో వెలిగించిన అఖండ జ్యోతితోనే.. దీపతూన్ వ‌ద్ద కార్తీక దీపం వెలిగించాలని అధికారుల‌ను ఆదేశించింది.

సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ.. నవంబర్ 24న తిరుప్పరంకుండ్రంలోని సంప్రదాయ ఉచ్చిపిళ్లయార్ మండపంలో మాత్రమే కార్తీక దీపం వెలిగించారు. వివాదాస్ప‌ద దీప‌తూన్ వద్ద వెలిగించలేదు. ఈ నేప‌థ్యంలో కార్తీక దీపాన్ని (Karthigai Deepam lamp) వెలిగించలేకపోయామని తమిళనాడు ప్రభుత్వం ఈనెల 25న‌ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆలయ ధర్మకర్తల మండలి అధికారిక అనుమతి ఇవ్వకపోవడం వల్లే ఇది సాధ్యపడలేదని వెల్ల‌డించింది. ఈ మేర‌కు కోర్టు ఆదేశాల‌ను పాటించలేకపోయినందుకు క్షమాపణలు కోరుతూ.. సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది.

ఇది కూడా చ‌ద‌వండి.. కొండ‌పై కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం ధ‌ర్మాస‌నం.. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మదురై జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, ఆలయ ట్రస్టీలకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. డిసెంబ‌ర్ 15న తదుపరి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది.

త‌మ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై క‌లెక్ట‌ర్‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం తీవ్రంగా మంద‌లించింది. ‘‘మీరు జిల్లా మేజిస్ట్రేట్. దీపం వెలిగేలా చూడటం మీ బాధ్య‌త‌. ఆ పని చేసి ఉండాల్సింది. ఎందుకు చేయలేదు..? కోర్టు ఆదేశాలను అతిక్రమించే అధికారం ఎవరికీ లేదు’’ అని వ్యాఖ్యానించింది. ఈ వివాదంలోని ప్ర‌ధాన అంశం జోలికి తాము వెళ్ల‌డం లేద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. న‌వంబ‌ర్ 24న ఒకేసారి దీప‌తూన్ వ‌ద్ద కార్తీక దీపం వెలిగించేందుకు అనుమ‌తిస్తూ నవంబర్ 20న తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడంపైనే విచార‌ణ‌కు ప‌రిమితం చేస్తున్నామ‌ని పేర్కొంది.

ఇది కూడా చ‌ద‌వండి.. మదురై కొండపై కార్తీక‌ దీపం వివాదం.. సుప్రీం కీల‌క ఆదేశాలు

ఆల‌య ట్ర‌స్టీల బోర్డుపై కూడా ధ‌ర్మాస‌నం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు గానూ బోర్డును సస్పెండ్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆలయ నిర్వహణ, దీపం వెలిగించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ ఎస్. పార్థిబన్‌లను రిసీవర్లుగా నియమించింది. ఆలయం, కొండ భద్రతా బాధ్యతలను CRPFకు అప్పగించింది. దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించింది.

Also Read..

గ్లోబల్ స‌మ్మిట్‌కు విద్యార్థుల‌ను త‌ర‌లించండి

హెచ్‌ఎండీ రైజ్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. ధర రూ.9,999 మాత్రమే..

తెలంగాణలో 2BHK ఇళ్లకు గుడ్ న్యూస్..

Advertisement
Advertisement