Karthigai Deepam lamp | తిరుప్పరంకుండ్రం కొండపై 100 ఏళ్ల తర్వాత వెలిగిన కార్తీక దీపం.. భక్తులు భావోద్వేగం
Karthigai Deepam lamp | తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఉన్న వివాదాస్పద దీపతూన్ (Deepathoon) వద్ద ఎట్టకేలకు కార్తీక దీపం (Karthigai Deepam lamp) వెలిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పటిష్ఠ భద్రత మధ్య పూజారులు దీపాన్ని వెలిగించారు.
Karthigai Deepam lamp | త్రినేత్ర న్యూస్ : మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఉన్న వివాదాస్పద దీపతూన్ (Deepathoon) వద్ద ఎట్టకేలకు కార్తీక దీపం (Karthigai Deepam lamp) వెలిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పటిష్ఠ భద్రత మధ్య పూజారులు దీపాన్ని వెలిగించారు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు రాతి స్తంభం వద్ద దీపం వెలిగింది. ఉచ్చిపిళ్లయార్ మండపం నుండి పవిత్ర జ్యోతిని తీసుకువచ్చి, సుమారు 50 మంది భక్తుల సమక్షంలో దీపతూన్ వద్ద వెలిగించారు.
#WATCH | Madurai, Tamil Nadu: The ceremonial Karthigai Deepam is lit at the Deepathoon stone pillar at Thiruparankundram Hill.
Retired High Court judges Justice S. Vaidyanathan and Justice V. Parthiban have been appointed as receivers to oversee the administration of the temple. https://t.co/dq5LLGNwsw
— ANI (@ANI) November 28, 2026
సుమారు వందేళ్ల తర్వాత ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే, కొండపైకి కేవలం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించారు. దర్గా చుట్టూ 50 మీటర్ల మేర బఫర్ జోన్‌గా ప్రకటించారు. ఈ కార్యక్రమం మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ ఎస్. పార్థిబన్‌ల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. దీపం వెలిగించిన క్షణం కొందరు భక్తులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పూలు వెదజల్లుతూ సంతోషం వ్యక్తం చేశారు.
#WATCH | Madurai, Tamil Nadu: Devotees turned emotional as the sacred Deepam was lit at Thiruparankundram hill following the Supreme Court's verdict. https://t.co/gApjGmjh5B
— ANI (@ANI) November 28, 2026
ఇది కూడా చదవండి.. తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం.. 164 ఏళ్ల చరిత్రలో కీలక మలుపు..!
దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం
తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఉన్న దర్గా సమీపంలో దీపం వెలిగించే అంశంపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. కొండపై భాగం యాజమాన్య హక్కులు, మతపరమైన ఆచారాల నిర్వహణపై 1915 నుంచే భిన్నాభిప్రాయాలు, న్యాయపోరాటాలు కొనసాగుతున్నాయి. ఆలయ అధికారులు, తమిళనాడు ప్రభుత్వం ఏటా ఉచ్చిపిళ్లైయార్ ఆలయం సమీపంలోని దీప మండపంలోనే కార్తీక దీపం వెలిగించడం సంప్రదాయమని పేర్కొంటున్నారు. మరికొందరు, హిందూ సంఘాలు దర్గా సమీపంలోని 'దీపతూన్' రాతి స్తంభం వద్ద దీపం వెలిగించాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో ఒకే ఒక్కసారి వెసులుబాటుగా ఈ ఏడాది నవంబర్ 24న షరతులకు లోబడి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే, ఆ రోజు దీపం వెలగలేదు.
#WATCH | Madurai, Tamil Nadu: Devotees celebrate and turn emotional as the sacred Deepam is lit atop Thiruparankundram hill following the Supreme Court's verdict https://t.co/t1tTR9Il0j
— ANI (@ANI) November 28, 2026
సుప్రీం ఆదేశాలు..
నవంబర్ 24న సాంప్రదాయ కార్తీక దీపాన్ని (Karthigai Deepam lamp) వెలిగించకపోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలను కచ్చితంగా పాటించి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద ఇవాళ జ్యోతిని వెలిగించాలని ఆదేశించింది. ఉచ్చిపిళ్లయార్ మండపంలో వెలిగించిన అఖండ జ్యోతితోనే.. దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలని అధికారులను ఆదేశించింది.
#WATCH | Madurai, Tamil Nadu: The ceremonial Karthigai Deepam is lit at the Deepathoon stone pillar at Thiruparankundram Hill following the Supreme Court's verdict. https://t.co/FymnyKGmyE
— ANI (@ANI) November 28, 2026
కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మదురై జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, ఆలయ ట్రస్టీలకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఆలయ ట్రస్టీల బోర్డుపై కూడా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు గానూ బోర్డును సస్పెండ్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆలయ నిర్వహణ, దీపం వెలిగించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ ఎస్. పార్థిబన్‌లను రిసీవర్లుగా నియమించింది. ఆలయం, కొండ భద్రతా బాధ్యతలను CRPFకు అప్పగించింది. దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించింది.
Also Read..
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ నియోజకవర్గాల పునర్విభజన..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tirupparankundram | తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం.. 164 ఏళ్ల చరిత్రలో కీలక మలుపు..!
నవంబర్ 28, 2026

MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేషన్‌కు మద్దతుపై భగ్గుమన్న విజయ్ పార్టీ
నవంబర్ 28, 2026

Supreme Court | ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గింపుపై పిటిషన్.. విచారణకు సుప్రీం నో
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Royal Enfield Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేసింది.. ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయి..?
- ●Tirupparankundram | తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం.. 164 ఏళ్ల చరిత్రలో కీలక మలుపు..!
- ●Pakistan-occupied Kashmir | పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ నియోజకవర్గాల పునర్విభజన..
- ●Wamiqa Gabbi | పంతొమ్మిదేళ్ల కెరీర్లో ఫస్ట్ టైమ్ - స్పెషల్ సాంగ్‌లో వామికా గబ్బి...
- ●Horrific Incident in Rangareddy District | అయ్యో పాపం! ముగ్గురు ఆడపిల్లలను నీటి సంపులో పడేసిన తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే!
- ●RBI | బంగారం ధరల పతనంతో ఆర్బీఐ అలర్ట్.. గోల్డ్ లోన్లపై నిఘా..

Royal Enfield Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేసింది.. ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయి..?

Tirupparankundram | తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం.. 164 ఏళ్ల చరిత్రలో కీలక మలుపు..!

Pakistan-occupied Kashmir | పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ నియోజకవర్గాల పునర్విభజన..

Wamiqa Gabbi | పంతొమ్మిదేళ్ల కెరీర్లో ఫస్ట్ టైమ్ - స్పెషల్ సాంగ్‌లో వామికా గబ్బి...



