Tirupparankundram | తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం.. 164 ఏళ్ల చరిత్రలో కీలక మలుపు..!
Tirupparankundram | తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం మరో కీలక మలుపు తిరిగింది. దాదాపు 164 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద దీపస్తంభంపై శనివారం (నవంబర్ 28న) కార్తీక దీపం వెలిగించాలని ఆదేశించింది. ఈ మేరకు తమ ఆదేశాలను అమలు చేసేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది చేసిన విషయం తెలిసిందే.
Devotional | Published On Nov 28, 2026, 5.10 pm IST
- నేడు వెలుగిన దీపం
- రంగంలోకి దిగిన సీఆర్‌పీఎఫ్ బలగాలు
- సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలుగిన జ్యోతి
- 1862 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందంటే..?
Tirupparankundram | తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదం మరో కీలక మలుపు తిరిగింది. దాదాపు 164 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద దీపస్తంభంపై శనివారం (నవంబర్ 28న) కార్తీక దీపం వెలిగించాలని ఆదేశించింది. ఈ మేరకు తమ ఆదేశాలను అమలు చేసేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు దీపం వెలిగించేందుకు సీఆర్‌పీఎఫ్ బలగాలు భద్రతా విధుల్లోకి దిగాయి. ప్రస్తుతం కొండను తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ క్రమంలో తిరుప్పరంకుండ్రంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. పెద్ద ఎత్తున భక్తులు కొండ ప్రాంతానికి చేరుకున్నారు.
1862లోనే వివాదానికి బీజం..
తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశంపై వివాదం 1862లోనే ప్రారంభమైంది. ఆ ఏడాది కొండ శిఖరంపై దీపం వెలిగించేందుకు ప్రయత్నించగా.. ఇది ఆనవాయితీగా వస్తున్న ఆచారం కాదని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అడ్డుకున్నారు. 1912లోనూ కొండపై దీపం వెలిగించే ప్రయత్నాన్ని రెవెన్యూ అధికారులు నిలిపివేసినట్లు కోర్టు రికార్డుల్లో నమోదైంది. 1915–16లో నెల్లితోప్పు ప్రాంతంలో యాత్రికుల కోసం ఓ మండపం నిర్మించాలని దర్గా నిర్వాహకులు ప్రయత్నించారు. ఇందుకోసం కొండ నుంచి రాళ్లు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆలయ నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల వారు ఉపయోగించుకునేలా ఉమ్మడి విశ్రాంతి మండపాన్ని నిర్మించాలని కలెక్టర్ ప్రతిపాదించారు. ఆలయ నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 1920–31 మధ్య కొండపై యాజమాన్య హక్కుల కోసం ఆలయ నిర్వాహకులు న్యాయపోరాటం చేశారు. 1923లో సబ్ కోర్టు ఇచ్చిన తీర్పును 1931లో ప్రివీ కౌన్సిల్ సమర్థించింది. కొండలో ఎక్కువ భాగం ఆలయానికి చెందుతుందని స్పష్టం చేసింది. నెల్లితోప్పు, దర్గా ఉన్న ప్రాంతం, ధ్వజస్తంభం, దాని అవతల ఉన్న మెట్ల ప్రాంతాలను మినహాయింపులుగా పేర్కొంది.
దీపం వెలిగించే అంశంపై కోర్టు కేసులు..
1994–96 మధ్య కొండపై మరో ప్రాంతంలో దీపం వెలిగించే అంశంపై దాఖలైన కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సంప్రదాయంగా దీపం వెలిగించే ప్రదేశంలోనే దీపం వెలిగించాలని, మరో ప్రాంతాన్ని ఎంచుకోవాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. 2014–17 మధ్య కొండ శిఖరంపై, గుర్రపు సునై ప్రాంతంలో దీపం వెలిగించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. 2021లో దర్గా వద్ద స్తంభం ఎత్తు పెంచే అంశం వివాదానికి దారితీసింది. చెక్క ధ్వజస్తంభానికి ఇనుప స్తంభాన్ని జోడించడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇనుప స్తంభాన్ని తొలగించాలని ఆదేశించారు. దీన్ని సవాల్ చేస్తూ దర్గా నిర్వాహకులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. 2024–25లో జంతుబలి, కందూర్ విందు అంశాలు వివాదాస్పదమయ్యాయి. 2025లో నెల్లితోప్పు ప్రాంతంలో జంతుబలి అనంతరం మాంసాహార వండడం, తీసుకురావడం సహా పలు అంశాలపై హైకోర్టు ఆంక్షలు విధించింది.
2025 డిసెంబర్ నుంచి కీలక పరిణామాలు..
2025 డిసెంబర్ 1న వివాదాస్పద దీపస్తంభంపై కూడా కార్తీక దీపం వెలిగించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. 2026 జనవరి 6న డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులను సమర్థించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2026 ఆగస్టు 3న పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, అప్పట్లో హైకోర్టు ఉత్తర్వుల అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, నవంబర్ 24న దీపం వెలిగించేందుకు అనుమతించింది. ఈ అనుమతితో భవిష్యత్తులో శాశ్వత హక్కు లభించినట్లు, ఇది సంప్రదాయంగా భావించరాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు అనుమతి ఉన్న దీపత్తూన్ వద్ద దీపం వెలుగలేదు. సంప్రదాయ దీపం వెలిగించే ఉచ్చి పిళ్లయార్ దీప మండపం వద్ద మాత్రమే దీపాన్ని వెలిగించారు.
అధికారులపై కోర్టు ధిక్కరణ నోటీసులు..
సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినా అధికారులు అమలు చేసేందుకు నిరాకరించారు. అయితే, ఈ నెల 27న ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆదేశాలను అమలు చేయని అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆలయ ట్రస్టీల బోర్డు రద్దు చేసింది. ఆలయ పరిపాలన పర్యవేక్షణ కోసం ఇద్దరు మాజీ న్యాయమూర్తులను నియమించింది. నవంబర్ 28న సీఆర్‌పీఎఫ్ భద్రత మధ్య దీపం వెలిగించాలని ఆదేశించింది. తాజాగా సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో శనివారం (నవంబర్ 28న) తిరుప్పరంకుండ్రం కొండపై వివాదాస్పద దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సీఆర్‌పీఎఫ్ సిబ్బంది భద్రతా విధుల్లోకి దిగారు. 1862 నుంచి కొనసాగుతున్న వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో దీపం వెలగనుంది. ఇప్పటికైనా సుప్రీం ఆదేశాలతో ఎట్టకేలకు దీపం వెలుగుతుందా? లేదా అని సుబ్రహ్మణ్యస్వామి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Devi Prasad | ఉద్యమ పోరాటం, ఆరాటాన్ని ప్రజలకు చెప్పాల్సి ఉంది.. పార్టీలకతీతంగా దీక్షా దివస్‌కు రండి
- ●TG Govt | కరువు వేళ రైతులకు ప్రభుత్వం భరోసా
- ●Vishwak Sen | యంగ్ పొలిటికల్ లీడర్‌గా విశ్వక్సేన్ - రాజకీయ వారసుల కష్టాలపై సినిమా
- ●Karthigai Deepam lamp | తిరుప్పరంకుండ్రం కొండపై 100 ఏళ్ల తర్వాత వెలిగిన కార్తీక దీపం.. భక్తులు భావోద్వేగం
- ●Royal Enfield Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేసింది.. ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయి..?
- ●Pakistan-occupied Kashmir | పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ నియోజకవర్గాల పునర్విభజన..

Devi Prasad | ఉద్యమ పోరాటం, ఆరాటాన్ని ప్రజలకు చెప్పాల్సి ఉంది.. పార్టీలకతీతంగా దీక్షా దివస్‌కు రండి

TG Govt | కరువు వేళ రైతులకు ప్రభుత్వం భరోసా

Vishwak Sen | యంగ్ పొలిటికల్ లీడర్‌గా విశ్వక్సేన్ - రాజకీయ వారసుల కష్టాలపై సినిమా

Karthigai Deepam lamp | తిరుప్పరంకుండ్రం కొండపై 100 ఏళ్ల తర్వాత వెలిగిన కార్తీక దీపం.. భక్తులు భావోద్వేగం




