త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | కొండ‌పై కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

Supreme Court | మదురై (Madurai) జిల్లా తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఉన్న వివాదాస్పద దీపతూన్ (Deepathoon) రాతి స్తంభం వద్ద నవంబర్ 24న సాంప్ర‌దాయ కార్తీక దీపాన్ని (Karthigai Deepam lamp) వెలిగించలేకపోయామని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాల‌ను పాటించలేకపోయినందుకు క్షమాపణలు కోరింది.

D

National | Published On Nov 25, 2026, 1.07 pm IST

Supreme Court | కొండ‌పై కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : మదురై (Madurai) జిల్లా తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై కార్తీక దీపం అంశం వివాదాస్ప‌ద‌మైంది. కొండ‌పై సికందర్ బాదుషా దర్గాకు (Sikandar Badusha Dargah) సమీపంలోని వివాదాస్పద స్తంభంపై దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అనుమ‌తించినప్ప‌టికీ అధికారులు న్యాయ‌స్థానం తీర్పును విస్మ‌రించారు. దీంతో ఈ అంశం రాజ‌కీయంగా తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది.

ఈ నేప‌థ్యంలో తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద దీపతూన్ (Deepathoon) రాతి స్తంభం వద్ద నవంబర్ 24న సాంప్ర‌దాయ కార్తీక దీపాన్ని (Karthigai Deepam lamp) వెలిగించలేకపోయామని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆలయ ధర్మకర్తల మండలి అధికారిక అనుమతి ఇవ్వకపోవడం వల్లే ఇది సాధ్యపడలేదని వెల్ల‌డించింది. ఈ మేర‌కు కోర్టు ఆదేశాల‌ను పాటించలేకపోయినందుకు క్షమాపణలు కోరుతూ.. సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది.

దీపం వెలిగించేందుకు దేవస్థానం అనుమతి పొందే విషయంలో జిల్లా యంత్రాంగం అన్ని విధాలా ప్రయత్నాలు చేసిందని మదురై జిల్లా కలెక్టర్ కృష్ణ కోర్టుకు తెలిపారు. అయితే, దీపతూన్‌ వద్ద దీపం వెలిగించడం వల్ల తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలకు భంగం వాటిల్లుతుందని పేర్కొంటూ ఆలయ పరిపాలనా మండలి అందుకు అనుమతి నిరాకరించిందని తెలిపారు. సంప్రదాయంగా దీపం వెలిగించే ఉచిపిళ్లయార్‌ మండపంలోనే జ్యోతిని వెలిగించిన‌ట్లు వివ‌రించారు.

కోర్టు ధిక్కార చ‌ర్య‌లు

వేడుకకు ఒకరోజు ముందు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని హామీ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం, ఆ తర్వాత కోర్టును తప్పుదోవ పట్టించిందని విచార‌ణ సంద‌ర్భంగా పిటిషనర్ రామ్ రవికుమార్ వాదించారు. దీప‌తూన్ వ‌ద్ద దీపం వెలిగించ‌కుండా అడ్డుకునేందుకు ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లిని ప్ర‌భుత్వం ఉప‌యోగించుకుంద‌ని ఆరోపించారు. ఈ మేర‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంపై కోర్టు ధిక్కార చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. అయితే, సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంపై అధికారికంగా పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది.

సుప్రీం కీల‌క ఆదేశాలు

కొండ‌పై కార్తీక‌ దీపాన్ని వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్ర‌వారం స్టే విధించిన విష‌యం తెలిసిందే. ఒకే ఒక్క‌సారి వెసులుబాటుగా ఈ ఏడాది నవంబర్ 24న ష‌ర‌తుల‌కు లోబ‌డి దీపారాధ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమ‌తించింది. నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను మదురై క‌లెక్ట‌ర్ కృష్ణ‌కు అప్ప‌గించింది.

వెల‌గ‌ని జ్యోతి

రాతి స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించినప్పటికీ.. మంగళవారం సంప్రదాయంగా దీపం వెలిగించే ఉచిపిళ్లయార్‌ మండపంలోనే జ్యోతిని వెలిగించారు. వివాదాస్పద దీపథూన్‌ వద్ద దీపం వెలిగించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. మ‌రోవైపు తిరుప్ప‌రంకుండ్రం కొండ చుట్టూ భ‌ద్ర‌త కొన‌సాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా భక్తులు, సాధారణ ప్రజలను కొండపైకి అనుమతించడం లేదు. నవంబర్ 23 సాయంత్రం 6 గంటల నుంచే పోలీసులు ఈ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొండపైకి వెళ్లే మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేసి, కేవలం స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు.

Also Read..

భార‌త్‌కు నిరాశ‌.. విశ్వ‌సుంద‌రి కిరీటాన్ని ఎగ‌రేసుకుపోయిన ప్యూర్టో రికో భామ

ఎన్‌ఎస్‌ఈ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బై రేటింగ్.. 20 శాతం లాభం అంచనా..

ద‌లైలామాకు ఢిల్లీలో అధికారిక బంగ్లా కేటాయింపు

Advertisement
Advertisement