త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Sanjay Jaju | గ్లోబల్ స‌మ్మిట్‌కు విద్యార్థుల‌ను త‌ర‌లించండి

CS Sanjay Jaju | రాష్ట్రంలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోయే గ్లోబ‌ల్ స‌మ్మిట్( Global Summit, Khelo India Youth Games ), ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీఎస్ సంజ‌య్ జాజూ( CS Sanjay Jaju ) స‌మీక్ష నిర్వ‌హించారు.

S

Telangana | Published On Nov 27, 2026, 4.01 pm IST

CS Sanjay Jaju | గ్లోబల్ స‌మ్మిట్‌కు విద్యార్థుల‌ను త‌ర‌లించండి
Advertisement

ఆ కార్య‌క్ర‌మాల‌ను వీక్షిస్తే విద్యార్థుల‌కు జ్ఞానం పెరుగుతుంది
గ్లోబ‌ల్ స‌మ్మిట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రివ్యూలో సీఎస్ వ్యాఖ్య‌

CS Sanjay Jaju | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోయే గ్లోబ‌ల్ స‌మ్మిట్( Global Summit, Khelo India Youth Games ), ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీఎస్ సంజ‌య్ జాజూ( CS Sanjay Jaju ) స‌మీక్ష నిర్వ‌హించారు. స‌చివాల‌యంలో జ‌రిగిన ఈ స‌మీక్ష‌కు ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో భాగంగా డిసెంబ‌ర్ 8న భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో నిర్వ‌హించే ర‌క్షా ఎక్స్‌పో, ఎయిర్‌షో కార్య‌క్ర‌మాల‌కు విద్యార్థుల‌కు త‌ర‌లించాల‌ని సీఎస్ అధికారుల‌ను ఆదేశించారు. స‌మీపంలో ఉన్న ప్ర‌భుత్వ‌, గురుకుల పాఠ‌శాల‌ల విద్యార్థుల‌ను భారీ సంఖ్య‌లో త‌ర‌లించాల‌ని, ఆ కార్య‌క్ర‌మాల‌ను వీక్షిస్తే జ్ఞానం వ‌స్తుంద‌న్నారు సీఎస్. డిసెంబ‌ర్ 11న ప్రారంభం కానున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో కూడా విద్యార్థుల‌ను భాగ‌స్వామ్యం చేయాల‌న్నారు. ర‌క్ష‌ణ‌, విమానయాన రంగంలో గొప్ప విజ‌యాలు సాధించడానికి ఈ కార్య‌క్ర‌మం స్ఫూర్తిగా నిలుస్తుంద‌న్నారు. గ్లోబ‌ల్ స‌మ్మిట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈవెంట్స్ విజ‌య‌వంతం కావ‌డానికి అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌న్నారు. విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేయాల‌న్నారు. విద్యార్థుల‌కు భోజ‌న ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ ఆదేశించారు.

Advertisement
Advertisement