Thiruparankundram Hilltop Lamp Ritual | మదురై కొండపై కార్తీక దీపం వివాదం.. సుప్రీం కీలక ఆదేశాలు
Thiruparankundram Hilltop Lamp Ritual | మదురై (Madurai) జిల్లా తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఉన్న దర్గా సమీపంలో దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం స్టే విధించింది. ఒకే ఒక్కసారి వెసులుబాటుగా ఈ ఏడాది నవంబర్ 24న షరతులకు లోబడి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది.
Thiruparankundram Hilltop Lamp Ritual | త్రినేత్ర న్యూస్ : తమిళనాడులోని మదురై (Madurai) జిల్లా తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఉన్న దర్గా సమీపంలో దీపం వెలిగించే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో కార్తిక దీపాన్ని వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం స్టే విధించింది. అయితే, ఒకే ఒక్కసారి వెసులుబాటుగా ఈ ఏడాది నవంబర్ 24న షరతులకు లోబడి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ తాత్కాలిక అనుమతిని వివాదాస్పద స్థలంలో దీపం వెలిగించే సంప్రదాయ హక్కుకు తుది ఆమోదంగా గానీ, కొండపై ప్రవేశం, ఆక్రమణ లేదా నియంత్రణకు సంబంధించి అదనపు హక్కుగా గానీ పరిగణించరాదని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో దీపం వెలిగించడానికి దీనిని ఒక సాక్ష్యంగా చూపడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు, దీపతూన్ వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులతో కూడిన పరిమిత బృందానికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి సాధారణ ప్రజలను, భక్తులను అనుమతించకూడదని కోర్టు ఆదేశించింది.
కేంద్ర బలగాలను మోహరించండి
ఇందుకు అవసరమైన తగిన భద్రత, కార్యక్రమ ఏర్పాట్లను మదురై జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీం ధర్మాసనం తెలిపింది. శాంతి భద్రతల దృష్ట్యా అవసరమైతే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలను కూడా మోహరించేందుకు సుప్రీం ధర్మాసనం అనుమతించింది. కొండపై ఉన్న దర్గా, మసీదుల్లో జరిగే సాధారణ ప్రార్థనలకు, భక్తుల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. నవంబర్ 24న జరిగే కార్తీక దీపం వేడుకకు మాత్రమే ఈ అనుమతి పరిమితమని కోర్టు మరోసారి స్పష్టతనిచ్చింది. కోర్టు తీర్పుతో మదురైలోని ఓ ఆలయం వెలుపల హిందువుల, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
అసలేంటి ఈ దీప స్తంభం వివాదం?
మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండ అడుగున సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. అదే కొండపై సికిందర్ బాదుషా దర్గా కూడా ఉంది. ఆ దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతన రాతి స్తంభం (దీప స్తంభం) పైన 'కార్తీక దీపం' వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు భక్తులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ (సింగిల్ జడ్జి జస్టిస్ జీఆర్ స్వామినాథన్).. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తగిన భద్రత మధ్య దీపం వెలిగించుకోవచ్చని 2025 డిసెంబర్‌లో తీర్పు చెప్పారు. ఆ తర్వాత జనవరి 6న డివిజన్ బెంచ్ కూడా ఈ తీర్పును సమర్థించింది. దీపం వెలిగించడం వల్ల దర్గా హక్కులకు ఎలాంటి భంగం కలగదని.. లా అండ్ ఆర్డర్ (Law and Order) సమస్యలు రావని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం ఏంటి?
పర్యావరణం, వారసత్వ సంపద రక్షణ, భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ దీపం వెలిగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం (HR&CE Department) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొండపై దర్గాకు సమీపంలో దీపం వెలిగించడం వల్ల మతపరమైన ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని వాదిస్తోంది. అంతేకాకుండా, ఆ నిర్దిష్ట రాతి స్తంభంపై దీపం వెలిగించినట్లు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని.. ఆ ఆచారం వేరే చోట ఉండేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ మేరకు కొండపై ఉన్న దీపతూన్ వద్ద భక్తులు సంప్రదాయ దీపాన్ని వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ 2025 డిసెంబర్‌లో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. నవంబర్ 24న కొన్ని షరతులకు లోబడి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు తాత్కాలికంగా అనుమతించింది.
Also Read..
ఒక్క రాష్ట్రంలోనే ఇన్ని కోటలా? ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం
నాలుగు కూనలకు జన్మనిచ్చిన KOMG 3.. దేశంలో మరింత పెరిగిన చీతాల కుటుంబం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్ఎల్పీలను కొట్టివేసిన కోర్టు..
నవంబర్ 20, 2026

Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
నవంబర్ 20, 2026

Supreme Court | మేనరిక వివాహాలపై చట్టం తెచ్చే అవసరాన్ని పరిశీలించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం
- ●AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!

Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!



