HMD Rise | హెచ్‌ఎండీ రైజ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ధర రూ.9,999 మాత్రమే..
HMD Rise | హెచ్‌ఎండీ సంస్థ భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ హెచ్‌ఎండీ రైజ్‌ను విడుదల చేసింది. 6.51 ఇంచుల డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రారంభ ఆఫర్లతో దీని ధరను రూ.9,999గా నిర్ణయించింది.
HMD Rise | హెచ్‌ఎండీ సంస్థ భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ హెచ్‌ఎండీ రైజ్‌ను విడుదల చేసింది. 6.51 ఇంచుల డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రారంభ ఆఫర్లతో దీని ధరను రూ.9,999గా నిర్ణయించింది.
భారీ బ్యాటరీ..
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ.10 వేలలోపు బడ్జెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని హెచ్‌ఎండీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రైజ్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 6.517 ఇంచుల డిస్‌ప్లే, డ్యుయల్ టోన్ డిజైన్ అందించారు. యూనిసోక్ 9863ఎ ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 13 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా ఇచ్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్‌బీ టైప్ సి కనెక్టివిటీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌కు రెండేళ్లపాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు.
ఏఐ ఫీచర్లు కూడా..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో సర్వం ఏఐ రూపొందించిన ఇండస్ ఏఐను కూడా అనుసంధానించారు. ఇది 22 భారతీయ భాషలకు మద్దతు ఇవ్వడంతోపాటు స్థానిక సంస్కృతికి అనుగుణమైన కంటెంట్‌ను అందిస్తుంది. ఈ సేవకు సంబంధించిన సర్వర్లు, డేటా భారత్‌లోనే హోస్ట్ అవుతాయని సంస్థ వెల్లడించింది. అదనంగా కేంద్ర ప్రభుత్వ సంచార్ సాథీ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. దీని ద్వారా వినియోగదారులు తమ పేరుపై ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని బ్లాక్ చేయడం, ట్రాక్ చేయడం, అనుమానాస్పద మోసపూరిత సమాచారాన్ని ఫిర్యాదు చేయడం, హ్యాండ్‌సెట్ అసలైనదో కాదో ధ్రువీకరించడం వంటి సేవలు పొందవచ్చు. అయితే సంచార్ సాథీ యాప్‌ను వినియోగదారులు ఐచ్ఛికంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 18 వేల పిన్‌కోడ్‌ల పరిధిలో 275 కస్టమర్ కేర్ కేంద్రాల ద్వారా సేవలు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
హెచ్‌ఎండీ రైజ్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ప్రారంభ ఆఫర్ల అనంతరం రూ.9,999 ప్రత్యేక ధరకు అందిస్తోంది. డిసెంబర్ 2 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇండిగో సిల్వర్, మిడ్‌నైట్ గోల్డ్, ఎమరాల్డ్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
సంబంధిత వార్తలు

ZENO 300 | రూ.9,649కే జెనో 300 స్మార్ట్‌ఫోన్.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ..
సెప్టెంబర్ 26, 2026

Infinix Smart 20 | పవర్ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్.. ధర ఎంతంటే..?
జూన్ 8, 2026

HMD | రూ.10 వేలలోపు 5జీ ఫోన్.. హాట్ కేక్‌లా అమ్మకాలు.. గంటలోనే సేల్ అవుట్..
మే 27, 2026
తాజావార్తలు
- ●Kodangal Land Scam | సీఎం ఇలాకాలో రూ.60 కోట్ల భూస్కాం.. బినామీల నుంచి 50 శాతం కమీషన్!
- ●HDFC Bank | హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అప్డేట్.. రూ.500లోపు యూపీఐ చెల్లింపులపై కీలక మార్పు..
- ●Supreme Court | ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గింపుపై పిటిషన్.. విచారణకు సుప్రీం నో
- ●Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..
- ●Samantha | కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో సమంత - కమ్‌బ్యాక్ అప్పుడేనా?
- ●Self Employed Indians | పింఛన్, ఈపీఎఫ్ లేవు.. రిటైర్మెంట్ ఆదాయం ఎలా పొందాలి?

Kodangal Land Scam | సీఎం ఇలాకాలో రూ.60 కోట్ల భూస్కాం.. బినామీల నుంచి 50 శాతం కమీషన్!

HDFC Bank | హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అప్డేట్.. రూ.500లోపు యూపీఐ చెల్లింపులపై కీలక మార్పు..

Supreme Court | ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గింపుపై పిటిషన్.. విచారణకు సుప్రీం నో

Instagram For TV | టీవీలోనూ ఇన్స్టాగ్రామ్.. ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్..



