Tata Sons | టాటా గ్రూప్ వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాటా సన్స్
Tata Sons | టాటా గ్రూప్‌లో యాజమాన్య వివాదం మరింత ముదిరింది. టాటా ట్రస్టులు, టాటా సన్స్ మధ్య కొనసాగుతున్న న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో టాటా సన్స్ శనివారం కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది. ట్రస్టులు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అప్పీల్ చేస్తే తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరింది.
- నవంబర్ 30న బోర్డు సమావేశానికి లైన్ క్లియర్
- కోర్టు అనుమతి లేకుండా ఏకపక్ష ఉత్తర్వులు రాకుండా కేవియట్
Tata Sons | టాటా గ్రూప్‌లో యాజమాన్య వివాదం మరింత ముదిరింది. టాటా ట్రస్టులు, టాటా సన్స్ మధ్య కొనసాగుతున్న న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో టాటా సన్స్ శనివారం కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది. ట్రస్టులు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అప్పీల్ చేస్తే తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను మూడోసారి ఐదేళ్ల కాలానికి నియమించడాన్ని సవాల్ చేస్తూ సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, ఆర్‌డీ టాటా ట్రస్ట్ కోర్టును ఆశ్రయించాయి. నవంబర్ 30న జరగనున్న బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరాయి. అయితే శుక్రవారం విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సమావేశంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారమే సమావేశం నిర్వహించుకోవచ్చని, అందులో తీసుకునే నిర్ణయాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2027 జనవరి 18కి వాయిదా వేసింది.
బోర్డు సమావేశంలో ఓటింగ్ సందర్భంగా అభిప్రాయ భేదాలు తలెత్తితే చంద్రశేఖరన్ కాస్టింగ్ ఓటు వినియోగించకుండా ఆదేశించాలని ట్రస్టులు కోరాయి. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో సమావేశం నిబంధనల ప్రకారం జరగనుంది. టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన రెండు ట్రస్టులు సెప్టెంబర్ 17న చంద్రశేఖరన్ పునర్నియామకానికి ఆమోదం తెలిపిన బోర్డు తీర్మానాన్ని సవాల్ చేశాయి. కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 121 ప్రకారం తప్పనిసరిగా అవసరమైన అనుకూల ఓటు లభించలేదని, అందువల్ల నియామకం చెల్లదని వాదిస్తున్నాయి. ఈ కేసులో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ రూ.50 కోట్లు, ఆర్‌డీ టాటా ట్రస్ట్ రూ.15 కోట్ల నష్టపరిహారంతో పాటు 18 శాతం వార్షిక వడ్డీని కోరాయి.
టాటా ట్రస్టుల చైర్మన్ నోయెల్ టాటా, చంద్రశేఖరన్ పునర్నియామకంతో పాటు టాటా సన్స్ పబ్లిక్ లిస్టింగ్‌ను కూడా వ్యతిరేకిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఆర్‌బీఐ టాటా సన్స్‌ను ఎన్‌బీఎఫ్‌సీ అప్పర్ లేయర్‌గా గుర్తించి స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయాలని నిర్దేశించడం కూడా వివాదానికి మరో కారణంగా మారింది. ఐపీఓను నివారించేందుకు గ్రూప్ వ్యాపారాల పునర్వ్యవస్థీకరణపై నోయెల్ టాటా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో నవంబర్ 30 బోర్డు సమావేశం, జనవరి 18న జరగనున్న తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
- ●High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
- ●Serial Actor | పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ యాక్టర్ - ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●BRS Australia | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్
- ●Delimitation & Constitutional Imbalance | లోక్‌సభ సీట్ల పెంపు సరే .. మరి రాజ్యసభ సంగతేంది?
- ●RIMS Incident | గర్భిణీ మృతి ఘటన.. రిమ్స్ వైద్యురాలికి ఉద్వాసన

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

Serial Actor | పెళ్లి చేసుకున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ యాక్టర్ - ఫొటోలపై ఓ లుక్కేయండి!

BRS Australia | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్





