Shashi Tharoor | ‘కేరళం’తో ఒరిగేదేంటి..? ప్రాజెక్టులు ముఖ్యం.. కేంద్ర ప్రభుత్వంపై శశి థరూర్ ఫైర్
Shashi Tharoor | కేరళ (Kerala) రాష్ట్రం పేరును 'కేరళం'గా (Keralam) మార్చడం వల్ల ఉపయోగం ఏంటో తనకేం అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కేవలం పేర్లు మార్చడంపైనే దృష్టిపెట్టిందని.. అభివృద్ధి ప్రాజెక్టులపై (No Projects) కాదని మండిపడ్డారు.
Shashi Tharoor | కేంద్ర ప్రభుత్వం కేరళ (Kerala) రాష్ట్రం పేరును 'కేరళం'గా (Keralam) మార్చడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం కేవలం పేర్లు మార్చడంపైనే దృష్టిపెట్టిందని.. అభివృద్ధి ప్రాజెక్టులపై (No Projects) కాదని మండిపడ్డారు. మలయాళంలో ఇప్పటికే కేరళ రాష్ట్రాన్ని కేరళంగా పిలుస్తారని అలాంటప్పుడు పేరు మార్పు వల్ల వచ్చే ఉపయోగం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ప్రాజెక్టులు లేవు కానీ పేర్లు మారుస్తున్నారు..
"కేరళ రాష్ట్రం మలయాళంలో "కేరళం"గానే ఉంది. ఇప్పుడు ఒక మలయాళ పదాన్ని ఆంగ్లంలోకి తీసుకొస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం పేరు మార్పుపై చూపిస్తున్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై చూపడం లేదు. బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టూ కేటాయించలేదు. ఎయిమ్స్ వంటి విద్యా సంస్థలను కేటాయించలేదు. కానీ పేరు మార్పు విషయంలో మాత్రం చాలా ఉత్సాహంగా ఆమోదం తెలిపింది" అని శశిథరూర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మరి వాటి సంగతేంటి..?
మరోవైపు కేరళం మార్పు నేపథ్యంలో కొన్ని భాషాపరమైన చిక్కుల గురించి థరూర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. రాష్ట్రం పేరు కేరళంగా మారితే.. ఇప్పటికే అక్కడ వాడుకలో ఉన్న 'కేరళైట్' (Keralite), 'కేరళన్' (Keralan) పదాల పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు. 'కేరళమైట్' (Keralamite) అంటే ఏదో ఒక సూక్ష్మజీవి పేరులా అనిపిస్తోందని, 'కేరళమియన్' (Keralamian) అంటే ఏదో అరుదైన ఖనిజం పేరులా ఉందని ఎద్దేశా చేశారు. ఈ కొత్త పదాల కోసం కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పోటీని నిర్వహించాలని అనుకుంటోందేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Also Read..
Stress | స్మోకింగ్, డ్రింకింగే కాదు.. దీన్ని కూడా వదిలించుకోవాలి.. వైద్యుల సూచన..
Road Crash | బారికేడ్లను తప్పించబోయి.. దుకాణాలపై దూసుకెళ్లిన ట్యాంకర్.. వీడియో
Donald Trump | నేను యుద్ధం ఆపకపోతే పాక్‌లో 3.50 కోట్ల మంది చనిపోయి ఉండేవారు: ట్రంప్
సంబంధిత వార్తలు

Arrest | బెంగళూరుకి పిలిచి కల్పిత విజయగాథలు చెప్పారు.. అందినకాడికి దోచుకుని కటకటాలపాలయ్యారు
జులై 23, 2026

Akhil Joyan | మరో రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే రష్యా దాడిలో కేరళ నావికుడు మృతి
జులై 21, 2026

FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
జులై 19, 2026
తాజావార్తలు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం



