Donald Trump | నేను యుద్ధం ఆపకపోతే పాక్‌లో 3.50 కోట్ల మంది చనిపోయి ఉండేవారు: ట్రంప్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాక్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాకిస్థాన్ ల మధ్య తాను అణు యుద్ధాన్ని ఆపానని అన్నారు. తాను అడ్డుపడకపోయి ఉంటే పాకిస్థాన్‌లో 3.50 కోట్ల మంది చనిపోయి ఉండేవారని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తనతో అన్నారని చెప్పారు.
International | Published On Feb 25, 2026, 9.41 am IST
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాక్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాకిస్థాన్ ల మధ్య తాను అణు యుద్ధాన్ని ఆపానని అన్నారు. తాను అడ్డుపడకపోయి ఉంటే పాకిస్థాన్‌లో 3.50 కోట్ల మంది చనిపోయి ఉండేవారని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తనతో అన్నారని చెప్పారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ఆపేందుకు తాను కృషి చేశానన్న ట్రంప్ అలా చేసి ఉండకపోతే పాక్ ప్రధాని కూడా చనిపోయి ఉండేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేట్ ఆఫ్ ది యూనియన్ ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు 8 యుద్ధాలను ఆపానని అన్నారు.
ప్రపంచ దేశాలపై తాను విధించిన టారిఫ్‌లను ట్రంప్ ఈ సందర్బంగా సమర్థించుకున్నారు. టారిఫ్‌ల విధింపు సరైన నిర్ణయమేనన్నారు. దీని వల్ల అమెరికన్లకు ఎంతో మేలు జరుగుతుందని, తక్కువ ధరలకే వస్తువులు లభిస్తున్నాయని అన్నారు. అమెరికా ప్రయోజనాల కోసమే తాను టారిఫ్‌లను పెంచానని, అందుకు కావల్సిన సర్వాధికారాలు తనకు ఉన్నాయని స్పష్టం చేశారు.
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ ఇలా వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ యుద్ధాన్ని తానే ఆపానని చెబుతూ వచ్చారు. ఇప్పుడే అదే చెప్పారు. ఆ యుద్ధాన్ని ఆపిన క్రెడిట్ తనదేనని అన్నారు. గతేడాది మే 10 నుంచి ఇప్పటి వరకు లెక్క వేస్తే దాదాపుగా 80 సార్లకు పైగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియాలోనూ పదే పదే ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నారు. అయితే భారత్ మాత్రం ఈ విషయాన్ని గతంలోనే ఖండించింది. ఇది ఇరు దేశాల మధ్య సమస్య అని, మూడో దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక భారత్ గతేడాది మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తోపాటు పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు, నిర్మాణాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. అంతకు ముందు ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన టెర్రరిస్టు దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ






