ED Raids | హవాలా కేసులో ఈడీ సోదాలు.. 4 గంటల తర్వాత అసలు విషయం తెలుసుకొని..!
ED Raids | హవాలా లావాదేవీల (hawala) కేసులో ఈడీ అధికారులు ఓ ఇంటిపై దాడి (ED raids) చేశారు. నాలుగు గంటలపాటు సోదాలు నిర్వహించారు. తీరా అసలు విషయం తెలుసుకుని నాలుక్కరుచుకున్నారు.
ED Raids | త్రినేత్ర న్యూస్: హవాలా లావాదేవీల (hawala) కేసులో ఈడీ అధికారులు ఓ ఇంటిపై దాడి (ED raids) చేశారు. నాలుగు గంటలపాటు సోదాలు నిర్వహించారు. తీరా అసలు విషయం తెలుసుకుని నాలుక్కరుచుకున్నారు. తాము వచ్చింది తప్పుడు చిరునామాకు (Wrong House) అని తెలుసుకుని ఉసూరుమంటూ అక్కడి నుంచి వెనుతిరిగారు. ఈ వింత ఘటన కేరళలోని కోజికోడ్ (Kozhikode) జిల్లాలో జరిగింది.
విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన, హవాలా లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా కేరళ (Kerala) వ్యాప్తంగా సుమారు 12 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల సమయంలో కోజికోడ్ జిల్లాలోని ఓ ఇంటికి చేరుకున్న అధికారులు, రూ.100 కోట్ల హవాలా కేసుకు (Hawala Transaction) సంబంధించి నౌషాద్ (Naushad) అనే వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. ఎవ్వరినీ బయటకు వెళ్లనీయకుండా.. సుమారు 4 గంటల పాటు ఆ ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు. అయితే సోదాలు ముగిసే సమయంలో అధికారులు నిందితుడి ఫోటో చూపించడంతో అసలు విషయం బయటపడింది. ఫొటోలో ఉన్న వ్యక్తితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ కుటుంబం తెలపడంతో.. తాము వెతుకుతున్న నిందితుడికి బదులుగా, అదే పేరున్న మరో వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు ఆలస్యంగా గుర్తించారు. కాగా, అసలు నిందితుడి తండ్రి పేరుకు, తన తండ్రి పేరుకు పొంతన లేదని బాధిత కుటుంబం పదేపదే మొరపెట్టుకున్నా అధికారులు వినిపించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
`ఉస్మాన్ (Usman) కుమారుడైన నౌషాద్ కోసం వచ్చినట్లు ఈడీ అధికారులు చెప్పారు. మా ఇంట్లో ఉండే నౌషాద్ తండ్రి పేరు మహమ్మద్ అని, ఉస్మాన్ కాదని మేము చెప్పాం. అయినా అధికారులు వెనక్కి వెళ్లడానికి నిరాకరించారు. దాంతో మేము ఇంటిని తనిఖీ చేయడానికి అనుమతించాం. వారు ఇల్లంతా సోదాలు చేసినా ఏమీ దొరకలేదు` అని బాధిత కుటుంబ సభ్యుడు చెప్పారు. దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు జరిపిన తర్వాత, చివర్లో అసలు నిందితుడి ఫోటోను అధికారులు తమకు చూపించారని, ఆ ఫోటోలో ఉన్నది నౌషాద్ కాదని చెప్పామన్నారు.
నౌషాద్ 9 నెలల క్రితమే షార్జాలోని ఓ కంపెనీలో ఉద్యోగం వదిలేసి కేరళకు తిరిగి వచ్చాడని, ప్రస్తుతం మత్స్యకారుడిగా పనిచేస్తున్నాడని కుటుంబ సభ్యులు వివరించారు. ఈడీ అధికారులు నౌషాద్ గుర్తింపు విషయంలో పొరబడ్డారని ఆరోపించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

AC Bus | అయ్యప్ప భక్తులకు సర్కార్ గుడ్‌న్యూస్.. పంబకు ఏసీ బస్సులు..!
నవంబర్ 20, 2026

ED Raids | ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం.. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇంట్లో ఈడీ సోదాలు
నవంబర్ 20, 2026

Sabarimala Pulmedu Route 2026 | శబరిమల భక్తులకు ముఖ్య గమనిక: తెరుచుకున్న పవిత్ర పులిమేడు అటవీ మార్గం.. టోకెన్లు, స్పాట్ బుకింగ్ పూర్తి వివరాలివే!
నవంబర్ 18, 2026
తాజావార్తలు
- ●EPFO WhatsApp Service | వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్.. పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
- ●Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
- ●Gold And Silver Prices Today | మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏడాది కనిష్ట స్థాయిలకు చేరిక..
- ●Eating Noodles | నూడుల్స్ తిని ఏడేళ్ల బాలిక మృతి
- ●IT Raids | స్నేహా ఫామ్స్‌పై ఐటీ దాడులు.. హైదరాబాద్, విజయవాడ సహా 16 చోట్ల సోదాలు
- ●GTA 6 | చరిత్ర సృష్టించిన జీటీఏ6.. తొలి రోజే 3.8 బిలియన్ డాలర్ల అమ్మకాలు..

EPFO WhatsApp Service | వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్.. పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్

Gold And Silver Prices Today | మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏడాది కనిష్ట స్థాయిలకు చేరిక..

Eating Noodles | నూడుల్స్ తిని ఏడేళ్ల బాలిక మృతి



