Stress | స్మోకింగ్, డ్రింకింగే కాదు.. దీన్ని కూడా వదిలించుకోవాలి.. వైద్యుల సూచన..
Stress | మద్యం సేవించడం, పొగ తాగడం ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఈ అలవాట్లను మానేయాలని డాక్టర్లు చెబుతుంటారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. అయినప్పటికీ చాలా మంది ఈ అలవాట్లను మానలేకపోతున్నారు. వీటి వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తుంది.
Stress | మద్యం సేవించడం, పొగ తాగడం ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఈ అలవాట్లను మానేయాలని డాక్టర్లు చెబుతుంటారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. అయినప్పటికీ చాలా మంది ఈ అలవాట్లను మానలేకపోతున్నారు. వీటి వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తుంది. అయితే కేవలం ఈ రెండు అలవాట్లే కాకుండా మరో రెండు అంశాలు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని ముంబైకి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరా తెలిపారు. అవి ఒత్తిడి, నిద్ర అని అన్నారు. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో, అధికంగా ఒత్తిడి ఉండడం, సరిగ్గా నిద్ర పోకపోవడం కూడా ఆరోగ్యానికి అంతే హానికరమని అన్నారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో ద్వారా ఆయా విషయాలపై పలు కీలక వివరాలను వెల్లడించారు.
మద్యపానంతో లివర్‌కు చేటు..
మద్యం సేవించడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుందని తెలిపారు. దీని వల్ల లివర్ చెడిపోతుందని, కిడ్నీలు డయాలసిస్ దశకు వస్తాయని, తీవ్రమైన కిడ్నీ ఫెయిల్యూర్ ఏర్పడి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని అన్నారు. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు గణనీయంగా దెబ్బ తింటాయని, క్యాన్సర్‌కు కారకం అవుతుందని, గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెండు అలవాట్లను పూర్తిగా మానేయాల్సి ఉంటుందని చెప్పారు.
ఒత్తిడిని వదిలించుకోవాలి..
ఒత్తిడి గురించి డాక్టర్ వోరా మాట్లాడుతూ మనిషి ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయని తెలిపారు. ఇవి శరీరంలో అధికంగా ఉన్నంత వరకు తీవ్రమైన తలనొప్పి, టెన్షన్, వెన్ను నొప్పి, కండరాలు బిగుసుకుపోవడం, భుజాల నొప్పులు, దంతాలు కొరకడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. అయితే ఒత్తిడిని తగ్గించుకుంటే ఈ లక్షణాలు వాటంతట అవే మాయమవుతాయని తెలిపారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇష్టమైన సంగీతం వినడం, ప్రకృతిలో గడపడం, పుస్తకాలు చదవడం, కుటుంబంతో సంతోషంగా క్షణాలను ఆస్వాదించడం, జోకులను చదవడం వంటి పనులు చేయాలన్నారు. యోగా, ధ్యానం వంటివి కూడా ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. వాస్తవానికి మద్యం సేవించడం, పొగతాగడం కన్నా ఒత్తిడి ఇంకా ప్రమాదకరమని, దీంతో వ్యాధులు ఇంకా త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయని అన్నారు.
View this post on Instagram
7 నుంచి 8 గంటల నిద్ర అవసరం..
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యమని డాక్టర్ వోరా అన్నారు. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలపాటు నిద్రించాలని సూచించారు. నిద్రించడం వల్ల ఒత్తిడి హార్మోన్ల ప్రభావం తగ్గడంతోపాటు శరీరం మరమ్మత్తులు చేసుకుంటుందని, కొత్త కణాలను నిర్మిస్తుందని, రోగ నిరోధక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ బలపడుతాయని తెలిపారు. చాలా మందికి తగినంత నిద్ర ఉండడం లేదని, ఇది కూడా వ్యాధులకు కారణమవుతుందని తెలిపారు. ఆరోగ్యంగా జీవించాలంటే నిద్ర చాలా అవసరమని పేర్కొన్నారు. సరైన నిద్ర లేకపోతే జీవనశైలి సంబంధిత వ్యాధులు వస్తాయని, ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ బారిన పడతారని తెలిపారు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడమే కాకుండా ఒత్తిడి నిర్వహణ, నిద్ర కూడా వ్యాధులు రాకుండా ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు.
సంబంధిత వార్తలు

Mother Kills Son | మద్యానికి బానిసై వేధిస్తున్నాడని.. కన్నకొడుకును కత్తెరతో పొడిచి కడతేర్చింది..
జులై 14, 2026

Headmaster | మద్యం తాగుతూ.. బూతు పాటలు చూస్తూ.. పాఠశాలను పబ్‌గా మార్చిన ప్రధానోపాధ్యాయుడు
జులై 11, 2026

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
జులై 10, 2026
తాజావార్తలు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం



