Affair Suspicion | మరొకరితో సంబంధం.. అనుమానంతో ప్రియురాలి దారుణ హత్య
Affair Suspicion | వారిద్దరు నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతిపై ఆమె ప్రియుడు అనుమానం (Affair Suspicion) పెంచుకున్నాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. దీంతో కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి (Stabbed to Death) చంపేశాడు.
Affair Suspicion | త్రినేత్ర న్యూస్: వారిద్దరు నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతిపై ఆమె ప్రియుడు అనుమానం (Affair Suspicion) పెంచుకున్నాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. దీంతో కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి (Stabbed to Death) చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.
కేరళకు చెందిన గంగ (22), గోకుల్ కృష్ణ (23).. బెంగళూరులోని ఓ కాలేజీలో నర్సింగ్ (Nursing Graduate) పూర్తి చేశారు. కాలేజీలో ఉండగానే తన జూనియర్ అయిన గంగను గోకుల్ ఇష్టపడ్డాడు. ఇద్దరిదీ ఒకే రాష్ట్రం (Kerala) కావడంతో పరిచయం, ప్రేమ జరిగిపోయాయి. గత నాలుగేండ్లుగా ఇరువురూ ప్రేమలో ఉన్నారు. గోకుల్ ప్రస్తుతం నర్సింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పించే పనిచేస్తుండగా, గంగా ఖాళీగా ఉంది. దీంతో ఉద్యోగం వెతికే పేరుతో ఆమెను బెంగళూరులోని (Bengaluru) ఓ లాడ్జికి తీసుకొచ్చాడు. అయితే మరో వ్యక్తితో సంబంధం (Relationship) పెట్టుకున్నదని ఆమెపై అనుమానం పెంచుకున్న అతడు.. ప్రియురాలిని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుంది. మాటామాటా పెరింది. తీవ్ర ఆవేశానికి లోనైన గోకుల్.. కత్తితో (Knife) గంగ కడుపులో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె రక్తపు మడుగులో పడిఉండటాన్ని గమనించి హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న పోలీసులు సమీపంలో ఉన్న దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు గోకుల్‌ను అరెస్టు చేసి విచారిస్తు్నారు.
తాజావార్తలు
- ●Supriya Sule | మోదీ కేబినెట్లోకి సుప్రియా సూలే..? డీలిమిటేషన్ మద్దతు ప్రతిఫలంగా ఎన్సీపీకి కీలక పదవులు..!
- ●WhatsApp Security | వాట్సాప్ యూజర్లకు సీఈఆర్టీ-ఇన్ హెచ్చరిక.. వెంటనే అప్డేట్ చేయండి..
- ●Karthika Deepam | కేపీహెచ్‌బీ విషాదం.. కార్తీక దీపం అంటుకుని యువతి మృతి
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. వారాంతంలో ర్యాలీ..
- ●X | ఎక్స్‌లో కొత్త ఫీచర్.. 18 నెలల ముందే పోస్టుల షెడ్యూలింగ్..
- ●Telangana | పారిశ్రామికాభివృద్ధికి సరికొత్త ఎజెండా.. ఇండస్ట్రియల్ పాలసీ 2.0

Supriya Sule | మోదీ కేబినెట్లోకి సుప్రియా సూలే..? డీలిమిటేషన్ మద్దతు ప్రతిఫలంగా ఎన్సీపీకి కీలక పదవులు..!

WhatsApp Security | వాట్సాప్ యూజర్లకు సీఈఆర్టీ-ఇన్ హెచ్చరిక.. వెంటనే అప్డేట్ చేయండి..

Karthika Deepam | కేపీహెచ్‌బీ విషాదం.. కార్తీక దీపం అంటుకుని యువతి మృతి

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. వారాంతంలో ర్యాలీ..






