Keralam | కేరళం అంటే ఏంటీ..? రాష్ట్రం పేరును ఎందుకు మార్చారంటే..?
Keralam | కేరళ రాష్ట్రం పేరు అధికారికంగా కేరళంగా మారింది. కేంద్రమంత్రి వర్గం మంగళవారం రాష్ట్రం పేరును మార్చేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర వారసత్వం, సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకుంది.
Keralam | కేరళ రాష్ట్రం పేరు అధికారికంగా కేరళంగా మారింది. కేంద్రమంత్రి వర్గం మంగళవారం రాష్ట్రం పేరును మార్చేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర వారసత్వం, సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ఏకగ్రీవంగా పేరును మార్చేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.
మలయాళంలో..
బ్రిటిష్ పాలనలో కేరళ అనేది ప్రాచుర్యం పొందింది. భారత రాజ్యాంగంలో కేరళ అని చేర్చారు. అయితే, స్థానికులు ఎప్పటి నుంచో మలయాళంలో కేరళం అని పిలుస్తుంటారు. మలయాళంలో కేర (Kera) అంటే కొబ్బరి చెట్టు. ఆలం (Alam) అంటే భూభాగం. కేరళ అంటే కొబ్బరిచెట్టు ఉన్న భూమి. ఈ కొబ్బరి చెట్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, జీవనశైలిని తరాలుగా ప్రభావితం చేస్తున్నాయి. చరిత్రకారుల ప్రకారం.. దక్షిణ భారతంలో మూడు ప్రధాన రాజ్యాలలో ఒకటి చేరా రాజవంశం. పురాతన తమిళ్, మలయాళ భాషల్లో ఈ ప్రాంతాన్ని “చేరళం” (Cheralam) అని పిలిచేవారు. కాలక్రమంలో సీహెచ్ పదం కాస్త కేగా.. చేరళం కాస్త కేరళంగా మారింది. మూడో శతాబ్దంలో చక్రవర్తి అశోకుడు ఈ ప్రాంతాన్ని కేరళపుత్రగా పేర్కొన్నారు. గ్రీకు, రోమన్ వ్యాపారులు తీర ప్రాంతాన్ని “కేలోబోత్రాస్ (Caelobothras”గా పిలిచారు. మలయాళంలో చాలా నామవాచకాలు ‘ఎం’తో ముగుస్తాయి. కేరళ (Keralam) పేరులో ‘ఎం’ని చేర్చడం వల్ల స్థానికులు తమ భాషా వారసత్వం, సాంస్కృతికి గుర్తింపు దక్కుతుందని భావించారు.
పేరు మార్పుకు కారణాలు..
కేరళలో దశాబ్దాలుగా మలయాళంలో కేరళంగా పిలుస్తుంటారు. కేరళ అనే పేరు బ్రిటీష్‌కాలంలో వచ్చింది. కేంద్రం పేరు మార్చేందుకు ఆమోదం తెలుపడంతో ఇకపై అన్నింట్లోనూ కేరళం అని పిలుస్తారు. అధికారిక రికార్డుల్లోనూ కేరళం అని ఉంటుంది. గతంలో బాంబే పేరు ముంబయి, మద్రాస్ పేరు చెన్నైగా మారినట్లుగానే.. స్థానికుల కోరిక మేరకు కేరళం పేరును మారుస్తూ నిర్ణజ్ఞం తీసుకున్నారు. సాంస్కృతిక గౌరవం దక్కడంతో పాటు మలయాళీల వారసత్వం నిలుపుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి కేరళ ప్రభుత్వం 2023, 2024లోనూ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనికి పలు పార్టీలు సైతం మద్దతును ప్రకటించాయి. ఈ పేరు మార్పు కేవలం ఆంగ్ల అక్షరాలు మార్చడం మాత్రమే కాదని.. యలయాల భాషా, సాంస్కృతిక గౌరవాన్ని, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విషయని పేర్కొంటున్నారు. భవిష్యత్తులో కేరళం పేరు అధికారికంగా రాష్ట్ర పాఠ్య పుస్తకాల్లోనూ చేర్చనున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






