States Name Change | కేరళ నుంచి కేరళం.. ఇంతకు ఎన్ని రాష్ట్రాల పేర్లు మారాయో తెలుసా..?
States Name Change | భారతదేశ పటంలో మారో మార్పు చోటు చేసుకున్నది. కేరళ రాష్ట్రం పేరుప్రస్తుతం అధికారికంగా కేరళంగా మారింది. మలయాళ ఉచ్చారణకు దగ్గరగా ఉండే రూపాన్ని రాష్ట్ర సర్కారుకు ముందుకు తీసుకురాగా.. కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇకపై కేరళ స్థానంలో పేరు కేరళంగా అధికారిక రికార్డుల్లో మారనున్నది.
States Name Change | భారతదేశ పటంలో మారో మార్పు చోటు చేసుకున్నది. కేరళ రాష్ట్రం పేరుప్రస్తుతం అధికారికంగా కేరళంగా మారింది. మలయాళ ఉచ్చారణకు దగ్గరగా ఉండే రూపాన్ని రాష్ట్ర సర్కారుకు ముందుకు తీసుకురాగా.. కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇకపై కేరళ స్థానంలో పేరు కేరళంగా అధికారిక రికార్డుల్లో మారనున్నది. ఎన్నో సంవత్సరాల మలయాళీల డిమాండ్ ఎట్టకేలకు సాకారమైంది. భారతదేశం ఒక సమాఖ్య వ్యవస్థ. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చరిత్ర ఉన్నది. భాషావైవిద్యంతో పాటు ప్రత్యేక ఆచార వ్యవహారాలు, జీవన విధానం ఉన్నది. అందుకే పేర్ల మార్పులు కేవలం పరిపాలనాపరంగా కాకుండా భావోద్వేగాలకు ప్రతిబింబంగా నిలుస్తాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక..
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశ రాజకీయ పటంలో అనేక మార్పులు జరిగాయి. కొన్ని రాష్ట్రాల సరిహద్దులు మారాయి. మరికొన్ని కొన్ని రాష్ట్రాలు పేర్లను మార్చుకున్నాయి. ఇవన్నీ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం.. పార్లమెంట్ ఆమోదంతోనే అమల్లోకి వచ్చాయి. చట్టబద్ధ ప్రక్రియను అనుసరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందాయి. ఈ క్రమంలోనే తాజాగా కేరళ రాష్ట్రం పేరు అధికారికంగా మార్పు జరిగింది. ఇకపై నుంచి కేరళను అధికారికంగా కేరళంగా పిలువనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్‌లో పేరును మార్చేందుకు ఆమోదం తెలిపారు. దాంతో కేరళ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది.
కేరళ రాష్ట్ర ఆవిర్భావం..
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొమ్మిదేళ్లకు కేరళ ఏర్పడింది. 1956 నవంబర్ ఒకటిన భాషా ప్రాతిపదికన మలయాళం మాట్లాడే ప్రాంతాలన్నింటిని కలిపి కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 1920ల నుంచే మలయాళం మాట్లాడే ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర సాధన చైతన్యం మొదలైంది. ఒకే భాష, ఒకే సాంప్రదాయాలను పంచుకునే ప్రాంతాలు ఒకటిగా ఉండాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కొచ్చి, ట్రావెన్‌కోర్, మలబార్ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశ స్వాతంత్య్రం అనంతరం భాషాప్రయుక్త రాష్ట్రాల అంశం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. తొలుత అప్పటి ప్రభుత్వం శ్యామ్ ధర్ కృష్ణ కమిషన్‌ను నియమించగా, అది భాషా ప్రాతిపదికన విభజన దేశ ప్రయోజనాలకు అనుకూలం కాదని సూచించింది. అయినా, ప్రజలు ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. 1949 జూలై 1న ట్రావెన్‌కోర్ మరియు కొచ్చిన్ రాచరిక ప్రాంతాలు విలీనం కావడంతో ట్రావెన్‌కోర్-కొచ్చిన్ రాష్ట్రం ఏర్పాటైంది. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలతో ఏర్పడిన జేవీపీ కమిటీ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుపై కీలక సూచనలు చేసింది. మలబార్ ప్రాంతం సైతం కలిసిన తర్వాత 1956లో కేరళ రాష్ట్రం ఏర్పాటైంది.
రాష్ట్రాల పేర్లను మార్చే విధానం..
ఏదైనా రాష్ట్రం పేరు మార్చాలంటే మొదట ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. రాష్ట్రపతి సిఫారసు ఆధారంగా పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెడుతారు. ఉభయసభల్లో సాధారణ మెజారిటీతో ఆమోదం లభిస్తే సరిపోతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తర్వాత రాష్ట్రం పేరు అధికారికంగా మారుతుంది. అయితే, దీనికి రాజ్యాంగ సవరణ అవసరం ఉండదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం.. సాధారణ చట్టం ద్వారానే ఈ మార్పు చేసేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత సంబంధిత అధికారిక పత్రాలలో, షెడ్యూల్‌లోనూ సవరణలు చేస్తారు.
గతంలో ఈ రాష్ట్రాల పేర్లు మారాయి..?
- 1950లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పేరు మారింది. అంతకు ముందు యునైటెడ్ ప్రావిన్సెస్ పేరుతో పిలిచేవారు.
- 2007లో ఉత్తరాంచల్ పేరును ఉత్తరాఖండ్‌గా మార్చారు.
- 1969లో మద్రాస్ స్టేట్ నుంచి తమిళనాడుగా పేరు మారింది.
- 1973లో మైసూర్ స్టేట్‌కి బదులుగా కర్నాటక పేరు అమలులోకి వచ్చింది.
- 2011లో ఒరిస్సాగా ఉన్న ఆ రాష్ట్రం పేరు ఒడిశాగా మార్పు చేశారు.
- 2006లో పాండిచ్చేరి పేరును పుదుచ్చేరిగా మార్చారు.
- 1973లో లక్కడివ్, మినీకాయ్, అమందివిల దీవుల సముదాయాన్ని లక్షద్వీప్‌గా మారింది.
- 2026లో కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..

Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ






