BJP-SAD alliance | మళ్లీ ఎన్డీయే గూటికి అకాలీదళ్.. పంజాబ్ ఎన్నికల్లో కలిసి పోటీ
BJP-SAD alliance | దాదాపు ఆరేళ్ల తర్వాత శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఎన్డీయే గూటికి చేరింది (BJP-SAD alliance). ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో పంజాబ్ ఎన్నికల్లో పొత్తును ఇరు పార్టీలూ అధికారికంగా ప్రకటించాయి.
BJP-SAD alliance | త్రినేత్ర న్యూస్ : వచ్చే ఏడాది ఆరంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు (Punjab Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఎన్డీయే గూటికి చేరింది (BJP-SAD alliance). ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో పంజాబ్ ఎన్నికల్లో పొత్తును ఇరు పార్టీలూ అధికారికంగా ప్రకటించాయి.
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీందర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal) అధికారికంగా ప్రకటించారు. నేటి నుంచే ఈ రెండు పార్టీలూ అధికార ఎన్డీయే భాగస్వాములుగా పనిచేస్తాయని అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడం, అవినీతిని నిర్మూలించడం, జాతీయవాద శక్తులను ఏకం చేయడం తమ కూటమి ప్రధాన లక్ష్యాలని షా పేర్కొన్నారు. పంజాబ్ రైతుల సమస్యలన్నింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అకాలీదళ్ రాకతో ఎన్డీయే పరిపూర్ణమైంది.. అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి ఎన్డీయేలోకి ఆహ్వానించారని షా తెలిపారు. బాదల్ సాహెబ్ పార్టీ రాకతోనే ఎన్డీయే పరిపూర్ణమైందని వ్యాఖ్యానించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ నాయకత్వంలో ఇరు పార్టీల మధ్య ఉన్న రాజకీయ అనుబంధాన్ని షా గుర్తు చేసుకున్నారు. ఈ కూటమిలో అకాలీదళ్ 'పెద్దన్న' (బడా భాయ్) పాత్ర పోషిస్తుందని చెప్పారు. పెద్దన్నే ముఖ్యమంత్రి అవుతారని అమిత్ షా స్పష్టం చేశారు.
ఈ పొత్తు కేవలం రాజకీయ కలయిక మాత్రమే కాదని.. హిందూ, సిక్కుల ఐక్యతకు, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాబ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై తమ వైఖరిని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తామని షా తెలిపారు. కాగా, 2020 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ (SAD) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమితో తన 24 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న విషయం తెలిసిందే.
Also Read..
తండ్రి ఇంటిని ఖాళీ చేయాల్సిందే.. కొడుకు, కోడలికి కోర్టు షాక్..!
రాజీవ్ గాంధీ హత్య కోసం ఉద్దేశపూర్వకంగానే భద్రతను తొలగించారు : సోనియా గాంధీ
కొడుకుకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చియాన్ విక్రమ్ మూవీ.. హీరోయిన్‌గా సాయిపల్లవి!
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | ఓట్ల తొలగింపుతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న బీజేపీ: మంత్రి పొన్నం ప్రభాకర్
నవంబర్ 24, 2026

Nitin Nabin | రేపు కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు
నవంబర్ 22, 2026

Delimitation Bill | వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరే వరకూ.. డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలి : కాంగ్రెస్
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Rashmika Mandanna | బయోపిక్ కోసం సంగీత పాఠాలు - నేషనల్ క్రష్ డెడికేషన్ అట్లుంటది మరి!
- ●Septic Tank deaths | హైదరాబాద్‌లో ఘోరం.. సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ఎంతమంది యువకులు చనిపోయారంటే!
- ●Edits App | ఎడిట్స్ ఐప్యాడ్ యాప్‌లో కొత్త ఫీచర్లు.. ఇక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ మరింత సులభం..
- ●Sadhguru On Dead Person Clothes | చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదు? వాటిని ఏం చేయాలి?
- ●Green India Challenge | కార్తీక హరిత సంకల్పం.. హిల్స్ కాలనీలో ఉసిరి, బిల్వ మొక్కల పంపిణీ
- ●Bisleri | మినరల్ వాటర్‌లో ఉండే బ్రోమేట్ ఆరోగ్యానికి ఎలా హానికరం..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

Rashmika Mandanna | బయోపిక్ కోసం సంగీత పాఠాలు - నేషనల్ క్రష్ డెడికేషన్ అట్లుంటది మరి!

Septic Tank deaths | హైదరాబాద్‌లో ఘోరం.. సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ఎంతమంది యువకులు చనిపోయారంటే!

Edits App | ఎడిట్స్ ఐప్యాడ్ యాప్‌లో కొత్త ఫీచర్లు.. ఇక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ మరింత సులభం..

Sadhguru On Dead Person Clothes | చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదు? వాటిని ఏం చేయాలి?



