CRPF chief | ఎలాంటి భయాలూ లేకుండా పనిచేయండి.. నాదీ బాధ్యత.. పెల్లెట్ వివాదం వేళ CRPF చీఫ్ కీలక వ్యాఖ్యలు
CRPF chief | కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ (DG) జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ (Gyanendra Pratap Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. CRPF బలగాలు నిర్భయంగా తమ విధులను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
CRPF chief | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా నీట్ ఫేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల (NEET paper leak protests) సమయంలో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్, పెల్లెట్ గన్స్ (Pellet guns) ఉపయోగించడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ (DG) జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ (Gyanendra Pratap Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. CRPF బలగాలు నిర్భయంగా తమ విధులను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సిబ్బంది భయం లేకుండా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. విధి నిర్వహణలో సిబ్బంది తీసుకునే నిర్ణయాలు, చర్యలకు డైరెక్టర్ జనరల్‌గా తాను పూర్తి బాధ్యత వహిస్తానని భరోసా ఇచ్చారు. సెంట్రల్ ఫోర్స్ ఇన్వెస్టిచర్ వేడుకలో పాల్గొన్న జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్.. సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. "సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నాను. అది ఆపరేషనల్ బెటాలియన్ అయినా లేదా లా అండ్ ఆర్డర్ యూనిట్ అయినా.. మీరు మీ విధులను నిజాయితీగా నిర్వర్తించే క్రమంలో తీసుకునే ఏ నిర్ణయానికైనా, చర్యకైనా నేనే బాధ్యత వహిస్తాను. ఎలాంటి సంకోచం, భయాలూ పెట్టుకోకుండా మీరు విధులను నిర్వర్తించండి. ప్రజాప్రయోజనం కోసం తీసుకునే చర్యలకు జవాబుదారీగా వ్యవహరించాల్సి వస్తే.. దానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను" అని అన్నారు.
కాగా, నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల సమయంలో విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్, పెల్లెట్ గన్స్ ఉపయోగించడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు, పలువురు రాజకీయ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదం వేళ సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read..
అజింక్యా రహానే రిటైర్మెంట్.. క్రికెట్‌కు వీడ్కోలు..
హృతిక్ రోషన్‌లా కనిపించానేమో.. కంగనకు కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కౌంటర్
యుద్ధ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
సంబంధిత వార్తలు

Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్‌లోకి వస్తలేరు
ఆగస్టు 10, 2026

Delhi Police | మా నాన్న యూనిఫామ్ రక్తంతో తడిసిపోయింది.. మాకూ న్యాయం చేయండి.. మీడియా ముందుకొచ్చిన గాయపడ్డ పోలీసు కుటుంబాలు
జులై 31, 2026

Pellet Guns | విద్యార్థులపైకి పెల్లెట్ గన్స్.. సీఆర్‌పీఎఫ్ డీజీ ఏమన్నారంటే..
జులై 30, 2026
తాజావార్తలు
- ●Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
- ●TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..
- ●DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు
- ●Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్
- ●UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్‌ను కాల్చి చంపాడు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్

TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..

DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు

Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్



