Graduate MLC | గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల.. డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు..
Graduate MLC | రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Electoral Roll) రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (SEC) సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గంలో 6,21,086 మంది ఓట్లు ఉండగా, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌లో 5,68,105 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని చెప్పారు.
Graduate MLC | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Electoral Roll) రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (SEC) సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గంలో 6,21,086 మంది ఓట్లు ఉండగా, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌లో 5,68,105 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని చెప్పారు. ముసాయిదా ఓటర్ల జాబితాను https://ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. దీనిపై డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 10వరకు గ్రాడ్యుయేట్ ఓటు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. డిసెంబరు 25వ తేదీలోగా అభ్యంతరాలను పరిష్కరిస్తామని తెలిపారు. అదే నెల 30న తుది జాబితాను విడుదల చేస్తామన్నారు.
కాగా, రెండు నియోజకవర్గాల్లో మొత్తం 12,69,191 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. అందులో 11,89,191 దరఖాస్తులను అర్హమైనవిగా గుర్తించామని, 80,635 దరఖాస్తులను అనర్హమైనవిగా తిరస్కరించినట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో 5,99,419 దరఖాస్తులు అందాయని, వాటిలో 5,68,105 దరఖాస్తులను ఆమోదించినట్లు చెప్పారు. సరైన పత్రాలు లేకపోవడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 31,314 దరఖాస్తులను తిరస్కించినట్లు పేర్కొన్నారు.
ఇక వరంగల్-ఖమ్మం-నల్లగొండలో 6,70,407 మంది ఓటుకోసం దరఖాస్తు చేసుకున్నారని, అందులో 6,21,086 మంది అర్హులైన ఓటర్లు ఉన్నారని తెలిపారు. మరో 49,321 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు వెల్లడించారు. కాగా, రెండు నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు 7,10,652 మంది, మహిళా ఓటర్లు 4,78,528 మంది ఉన్నారని చెప్పారు. మొత్తం 1,703 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఆమోదించిందన్నారు. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.
ముసాయిదా జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తాజావార్తలు
- ●Lung Cancer | విషగాలి పంజా.. పొగతాగని వారిలోనూ విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్..!
- ●Tummala Nageshwar Rao | రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికత అందిస్తాం
- ●Kavitha | పాఠశాల విద్యలో ఇంటర్ను కలుపుతారా?.. ఇంటర్లో స్కూల్ విద్యను కలుపుతారా?: కవిత
- ●Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీల్లో ర్యాలీ..
- ●Garividi Lakshmi OTT | ఓటీటీలోకి ఉత్తరాంధ్ర జానపద గాయని బయోపిక్.. రేపటి నుంచే స్ట్రీమింగ్!
- ●Hyderabad | జేబులో పేలిన పవర్ బ్యాంక్.. కుడి కన్నుకు తీవ్ర గాయం

Lung Cancer | విషగాలి పంజా.. పొగతాగని వారిలోనూ విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్..!

Tummala Nageshwar Rao | రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికత అందిస్తాం

Kavitha | పాఠశాల విద్యలో ఇంటర్ను కలుపుతారా?.. ఇంటర్లో స్కూల్ విద్యను కలుపుతారా?: కవిత

Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీల్లో ర్యాలీ..





