Pellet Guns | విద్యార్థులపైకి పెల్లెట్ గన్స్.. సీఆర్‌పీఎఫ్ డీజీ ఏమన్నారంటే..
Pellet Guns | నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు బాధ్యతవహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఈ నెల 20న ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులపైకి ఆర్ఏఎఫ్ (RAF) బలగాలు పెల్లెట్ గన్‌లను (Pellet Guns) ఉపయోగించడం తీవ్ర వివాదానికి దారితీసింది.
Pellet Guns | త్రినేత్ర.న్యూస్: నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు బాధ్యతవహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఈ నెల 20న ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులపైకి ఆర్ఏఎఫ్ (RAF) బలగాలు పెల్లెట్ గన్‌లను (Pellet Guns) ఉపయోగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు విద్యార్థులు, యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విద్యార్థులు, నిరసనకారుల పట్ల పోలీసులు, భద్రతా దళాలు వ్యవరించిన తీరుపై పెద్ద దుమారం చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ (CRPF DG) తన బలగాలకు పూర్తిస్థాయిలో భరోసా నిచ్చారు. ఎలాంటి భయం లేకుండా మీ విధులను నిర్వహించండి.. విధులను నిజాయితీగా నిర్వర్తించే క్రమంలో తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తాను బాధ్యత వహిస్తానంటూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.

బుధవారం సీఆర్‌పీఎఫ్ అవార్డుల ప్రదాన వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ (GP Singh) మాట్లాడుతూ.. `సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నేను మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నాను. అది ఆపరేషనల్ బెటాలియన్ అయినా, లా అండ్ ఆర్డర్ యూనిట్ అయినా, మీ విధులను నిజాయితీగా నిర్వర్తించే క్రమంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, ఏ చర్యలు చేపట్టినా.. వాటికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. నిర్భయంగా మీ విధులను నిర్వహించండి. ఎక్కడైనా బాధ్యత లేదా జవాదారీతనం తీసుకోవాల్సివచ్చినప్పుడు డైరెక్టర్ జనరల్‌గా నేను దానిని తీసుకుంటా` అంటూ తన సిబ్బందికి వెన్నుదన్నుగా నిలిచారు.

జూలై 20న ఏం జరిగిందంటే..
కాగా, ఈ నెల 20న జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపైకి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు (RAF) ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా పెల్లెట్ గన్‌తో కాల్పులు జరిపాయి. దీంతో గురుగ్రామ్‌లో ఉద్యోగం చేస్తున్న 25 ఏండ్ల షేక్ ఇర్షద్ మన్సూరి, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సాహిల్ లోబాబ్, నూతన్ టొప్పో, జర్నలిస్ట్ ప్రశాంత్ సింగ్, బీహార్‌కు చెందిన మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇర్షత్ ముఖం, మెడ భాగంలో వందలాది చిన్న సీసపు గుళికలు (పెల్లెట్లు) దూసుకెళ్లాయి. ప్రాణాపాయం ఉండటంతో అతని మెడలోని ప్రధాన రక్తనాళం దగ్గరున్న ఒక పెల్లెట్‌ను వైద్యులు తొలగించలేకపోయారు. సాహిల్ లోచాబ్ అనే యువకుడు తన కుడి కంటి చూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు.
సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ప్రత్యేక విభాగం ఆర్ఏఎఫ్. దీనిని దేశవ్యాప్తంగా అల్లర్లు, సామూహిక ఆందోళనలు వంటి పరిస్థితులను నియంత్రించేందుకు వినియోగిస్తారు. విద్యార్థుల నిరసనల సందర్భంగా ఢిల్లీలో వీధుల్లో కూడా ఆర్ఏఎఫ్ బలగాలను కేంద్ర ప్రభుత్వం భారీగా మోహరించింది.
సంబంధిత వార్తలు

Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం
ఆగస్టు 24, 2026

Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్‌లోకి వస్తలేరు
ఆగస్టు 10, 2026

Rahul Gandhi | బీజేపీలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు?.. ఇదీ రాహుల్ గాంధీ సమాధానం.. వీడియో
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
- ●TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..
- ●DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు
- ●Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్
- ●UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్‌ను కాల్చి చంపాడు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్

TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..

DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు

Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్



