Supreme Court | అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడొచ్చు : సుప్రీంకోర్టు
Supreme Court | పెల్లెట్ గన్స్ (Pellet Guns) వాడకంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ (Pellet Guns) ఉపయోగించే అధికారం పోలీసులకు ఉంటుందని స్పష్టం చేసింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీ జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద సీజేపీ నిరసనల సందర్భంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ (Pellet Guns) ఉపయోగించే అధికారం పోలీసులకు ఉంటుందని స్పష్టం చేసింది.
పెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే నిబంధనల ప్రకారం పెల్లెట్ గన్స్ ఉపయోగించే అధికారం పోలీసులకు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో జులై 20వ తేదీన జంతర్ మంతర్ ప్రాంతంలో మోహరించిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) వినియోగించిన అమ్యునిషన్‌కు సంబంధించిన అన్ని లాగ్స్, రికార్డులను భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఇక నిరసనల్లో గాయపడిన బాధితులకు తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది.
ఈ కేసుపై సుప్రీంకోర్టులో వాడీవేడీ చర్చ జరిగింది. నిరసనకారులపై పోలీసులు రబ్బరు లేదా ప్లాస్టిక్ పెల్లెట్లకు బదులు భిన్నమైన కైనెటిక్ మెటాలిక్ ప్రొజెక్టైల్స్‌ను ఉపయోగించారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అసాధారణ పరిస్థితులు, సందర్భాల్లో మాత్రమే పెల్లెట్ గన్స్ ప్రయోగించాలనే నిబంధనలు ఉన్నా.. అందుకు విరుద్ధంగా దేశ యువతపైనే పెల్లెట్ గన్స్ ఉపయోగించారని పేర్కొన్నారు. "పెల్లెట్స్ గుంపులపై ప్రయోగించామని పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ గుంపు స్టూడెంట్స్. వాళ్లేమీ తీవ్రవాదులు కాదు" అని న్యాయవాది వాదించారు. పెల్లెట్ల వాడకంపై పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
స్పందించిన ధర్మాసనం.. అత్యవసర పరిస్థితుల్లో బలప్రయోగం లేదా తీవ్రమైన ఆయుధాల వాడకానికి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని తెలిపింది. కేవలం పెల్లెట్ గన్‌లపై మాత్రమే ఏకపక్షంగా నిషేధం కోరడం సరికాదని అభిప్రాయపడింది. అయితే వాటి వినియోగానికి కచ్చితమైన నిబంధనలు, నియంత్రణలు తప్పనిసరిగా ఉండాలని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పెల్లెట్ గన్స్ వినియోగానికి సంబంధించి విధివిధానాలు ఏంటీ.. ఎలాంటి సమయంలో పెల్లెట్లు ఉపయోగిస్తారు..? దానికి సంబంధించిన పూర్తి వివరాలు నివేదిక రూపంలో అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వ నివేదిక తర్వాత ఈ పిటిషన్లపై పూర్తి విచారణ చేస్తామని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటిలోపు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, సంబంధిత అధికారుల నుంచి పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read..
షాకింగ్.. మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం
హృతిక్ రోషన్‌లా కనిపించానేమో.. కంగనకు కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కౌంటర్
ఎలాంటి భయాలూ లేకుండా పనిచేయండి.. నాదీ బాధ్యత.. పెల్లెట్ వివాదం వేళ CRPF చీఫ్ కీలక వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు

Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు
సెప్టెంబర్ 21, 2026

Delhi | ఢిల్లీలో మరో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి ఆరోతరగతి బాలికపై లైంగిక దాడి
సెప్టెంబర్ 21, 2026

MLC Dasoju Sravan | నిన్న పులి.. నేడు పిల్లి.. ‘దానం’పై ఎమ్మెల్సీ దాసోజు సెటైర్లు
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు



