Pinarayi Vijayan | ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు.. రేవంత్‌పై పినరయి విజయన్ ఫైర్
Pinarayi Vijayan | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైడ్రా (HYDRAA) ప్రాజెక్టును.. నాజీ నియంత అడాలఫ్ హిట్లర్ స్పూర్తితో చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Pinarayi Vijayan | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో పేదల ఇండ్లను కూల్చేందుకు చేపట్టిన హైడ్రా (HYDRAA) ప్రాజెక్టును.. నాజీ నియంత అడాలఫ్ హిట్లర్ స్పూర్తితో చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలు తనను షాక్‌కు గురిచేశాయని, ప్రజాస్వామ్య విలువలను అవమానించేవిలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విజయన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు.
తన బుల్డోజర్ రాజ్‌ను సమర్థించుకునేందుకు హైడ్రా గురించి పబ్లిక్‌గా, గర్వంగా ఫీలవుతున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. చరిత్రలోనే అత్యంత కిరాతకమైన నియంతగా పేరు గాంచిన హిట్లర్ స్పూర్తితో హైడ్రాను ఏర్పాటుచేసినట్లు రేవంత్ స్వయంగా, గర్వంగా ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్య దేశానికి చెందిన ఓ ముఖ్యమంత్రి.. హింస, నిరంకుశత్వానికి కేంద్ర బిందువైన ఓ వ్యవస్థను స్పూర్తిగా తీసుకున్నానని పబ్లిక్‌గా మాట్లాడటం సిగ్గుచేటు. ఫాసిజానికి నిలువెత్తు రూపంగా భావించే హిట్లర్‌ను కాంగ్రెస్ ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రశంసించడం ఆందోళనకరం.
రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్లీన రాజకీయ నైజాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అంతేకాదు, తెలంగాణ సీఎం రేవంత్‌కు గతంలో సంఘ్ పరివార్‌తో లింకులు ఉన్నాయి. ఆ ప్రభావం కూడా ఆయన వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ విధానాలను కాంగ్రెస్ ఎప్పటికీ వ్యతిరేకించలేదనే వామపక్షాల వాదనను రేవంత్ వ్యాఖ్యలు మరింత బలపరుస్తున్నాయి అని పినరయి విజయన్ తన ఫేస్‌బుక్ పోస్టులో రాసుకొచ్చారు.
హిట్లర్ ఇన్‌స్పిరేషన్‌గా ‘హైడ్రా’..
కాగా, శనివారం బెంగుళూరలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరంతో పాటు శివారు పరిధిలో ఆక్రమణలకు గురైన చెరువులను, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాటైన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'హైడ్రా' వర్డ్ అనేది హిట్లర్ ఫేవరేట్ వర్డ్. 'హైడ్రా' అనేది హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదం. అతని వద్ద ఉన్న కోర్ బృందాన్ని హైడ్రా అని పిలిచేవారు. ఆ బృందం మరణమృదంగం సృష్టించేది. కాబట్టి నేను హిట్లర్ నుండి స్ఫూర్తి పొంది, ఆ ప్రాజెక్టుకు 'హైడ్రా' అని పేరు పెట్టాను. అక్రమ కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తూ హైడ్రా కబ్జాదారుల్లో వణుకు పుట్టిస్తుంది. ఈ విషయాన్ని ఎవర్నీ అడిగినా చెబుతారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Also Read..
హైవేపై ఆగివున్న లారీని ఢీకొట్టిన ట్రక్కు, కారు.. Viral Video
వెంటనే ఇరాన్‌ను వీడండి.. తమ పౌరులకు భారత్ కీలక అడ్వైజరీ
రేపు కౌలు రైతుల సర్వే రిపోర్ట్ వెల్లడిస్తాం: కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ
సంబంధిత వార్తలు

Telangana Urban Development | తెలంగాణ పట్టణ సంస్కరణలపై నేపాల్ ప్రతినిధుల అధ్యయనం
ఆగస్టు 3, 2026

SIR | ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
ఆగస్టు 3, 2026

CS Sanjay Jaju | పథకాల అమలులో వేగం పెంచాలి.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Telangana Police Insurance | విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి.. బాధిత కుటుంబానికి కోటి బీమా చెక్ అందజేసిన డీజీపీ
- ●Telangana Urban Development | తెలంగాణ పట్టణ సంస్కరణలపై నేపాల్ ప్రతినిధుల అధ్యయనం
- ●SIR | ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
- ●CS Sanjay Jaju | పథకాల అమలులో వేగం పెంచాలి.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం
- ●Tamil OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ - ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లు - తెలుగులో స్ట్రీమింగ్
- ●Suriya | జ్యోతికతో సూర్య ఫొటోషూట్ - పెళ్లై ఇరవై ఏళ్లయ్యిందంటే నమ్మలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్

Telangana Police Insurance | విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి.. బాధిత కుటుంబానికి కోటి బీమా చెక్ అందజేసిన డీజీపీ

Telangana Urban Development | తెలంగాణ పట్టణ సంస్కరణలపై నేపాల్ ప్రతినిధుల అధ్యయనం

SIR | ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి

CS Sanjay Jaju | పథకాల అమలులో వేగం పెంచాలి.. అధికారులకు సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం



