Speeding Truck | హైవేపై ఆగివున్న లారీని ఢీకొట్టిన ట్రక్కు, కారు.. Viral Video
Speeding Truck | త్రినేత్ర.న్యూస్: తమిళనాడులోని నమక్కల్ జిల్లా తిరుచెంగోడ్ (Tiruchengode) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై బ్రేక్‌డౌన్ అవడంతో ఆగి ఉన్న లారీని.. వెనుక నుంచి ఓ ట్రక్కు (Speeding Truck), కారు బలంగా ఢీకొట్టాయి.
Speeding Truck | త్రినేత్ర.న్యూస్: తమిళనాడులోని నమక్కల్ జిల్లా తిరుచెంగోడ్ (Tiruchengode) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై బ్రేక్‌డౌన్ అవడంతో ఆగి ఉన్న లారీని.. వెనుక నుంచి ఓ ట్రక్కు (Speeding Truck), కారు బలంగా ఢీకొట్టాయి. శనివారం (జూన్ 6న) రాత్రి 10.14 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
తిరుచెంగోడ్ వద్ద జేసీబీని తీసుకెళ్తున్న ట్రక్కు బ్రేక్‌డౌన్ అయింది. దీంతో రోడ్డుకు కుడివైపున లారీని నిలివేశారు. ఈ క్రమంలో ఓ వాహనాన్ని స్టేషనరీ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఓవర్‌టేక్ చేస్తున్నది. దగ్గరగా వచ్చిన తర్వత ఆగి ఉన్న లారీని గమనించిన ట్రక్కు డ్రైవర్ ఎడమైపు మలిపాడు. అయితే ట్రక్కు ముందు టైరు అప్పటికే లారీకి తాకడంతో బోల్తాపడింది. అదే సమయంలో ట్రక్కు వెనకే వస్తున్న కారు ఆ లారీని ఢీకొట్టింది.
రోడ్డుపై ఆగిఉన్న లారీ, దానిపై జేసీబీ కి లైట్లు వెలుగుతున్నప్పటికీ.. ట్రక్కు డ్రైవర్ దానిని గమనించకోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా మరణించారా అనే విషయం తెలియరాలేదు. వాహనం డ్యాష్ బోర్డులో ఉన్న కెమెరాలో ఈ ప్రమాదం రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
In Namakkal's Tiruchengode, a lorry transporting a JCB reportedly broke down in the right lane of a highway, with the construction vehicle's hazard lights and flashers activated.
Despite the warning lights, an approaching lorry is said to have noticed the stationary vehicle only… pic.twitter.com/6hIWd6njHG
— Hate Detector 🔍 (@HateDetectors) June 7, 2026
తాజావార్తలు
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం






